Jr NTR: తారక్ బర్త్ డేకు కొరటాల సర్ప్రైజ్.. అదేమిటంటే..?

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా తెరకెక్కి కలెక్షన్లపరంగా రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుండటంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండగా కొరటాల శివ ఫ్యాన్స్ కోసం షాకింగ్ సర్పైజ్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. జనతా గ్యారేజ్ సినిమాలో మలయాళ నటుడు మోహన్ లాల్ కు ఛాన్స్ ఇచ్చిన కొరటాల శివ ఎన్టీఆర్ తరువాత సినిమా కోసం మమ్ముట్టిని రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది.

యాత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే సుపరిచితమైన మమ్ముట్టి అనువాద చిత్రాల ద్వారా కూడా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. అయితే ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కోసం పవర్ ఫుల్ సబ్జెక్ట్ ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రతి సినిమాలో అంతర్లీనంగా సందేశం ఉండేలా జాగ్రత్తలు తీసుకునే కొరటాల శివ ఎన్టీఆర్ ను కొత్తగా చూపించబోతున్నారని తెలుస్తోంది.

కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా దాదాపుగా ఫైనల్ అయ్యారని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమాను రిలీజ్ చేయాలని కొరటాల శివ, ఎన్టీఆర్ భావిస్తున్నారు. ఆచార్యకే సినిమాకే మూడేళ్లు పరిమితమైన కొరటాల శివ ఇకపై వేగంగా సినిమలను తెరకెక్కించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమా తరువాత బన్నీ లేదా అఖిల్ తో కొరటాల శివ సినిమాను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus