Bollywood: టాలీవుడ్‌ డైరెక్టర్‌ సైలెంట్‌గా బాలీవుడ్‌ సినిమా చేసేశారు.. ఈ వారమే విడుదల!

తెలుగు సినిమా దర్శకులు బాలీవుడ్‌ వెళ్లి సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. చాలామంది దర్శకులు ఇలా వెళ్లి చేసొచ్చారు కూడా. ఆ మాటకొస్తే సౌత్‌ దర్శకులు చాలామంది ఇలా ముంబయి విమానం ఎక్కినవాళ్లే. అయితే ఇందులో కొందరి సినిమాలు స్టార్ట్‌ అయినప్పుడు, రిలీజ్‌ అయినప్పుడు మన దగ్గర బజ్‌ ఉంటుంది. కొందరివి అయితే పెద్దగా తెలియదు. అలా పెద్దగా తెలియకుండా విడుదలకు సిద్ధమైపోయింది ఓ సినిమా. అదే ‘8ఏఎం మెట్రో’. ఈ సినిమా 19న విడుదలైంది కూడా.

ఇదేం సినిమా.. మన తెలుగు దర్శకుడు (Bollywood) బాలీవుడ్‌లో తీసిందా? అనే డౌట్ వస్తోందా. అవును ఈ సినిమా దర్శకుడు తెలుగాయన. ‘మల్లేశం’ లాంటి వైవిధ్యమైన, మనసును హత్తుకునే సినిమాను తెరకెక్కించిన రాజ్‌ రాచకొండ బాలీవుడ్‌కి వెళ్లారు. ఏకంగా సినిమా పూర్తి విడుదల చేశారు కూడా. ఓ నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు మంచి స్పందన కూడా వస్తోంది. దీంతో తెలుగు దర్శకులు బాలీవుడ్‌లో వరుసగా రెండు విజయాలు అందుకున్నట్లు అయ్యింది.

‘ఘాజీ’, ‘అంతరిక్షం’ లాంటి సినిమాలు తీసిన సంకల్ప్‌ రెడ్డి.. ఇటీవల విద్యుత్‌ జమ్వాల్‌ హీరోగా ‘ఐబీ 71’ చేశారు. తొలి రోజుల్లో సరైన స్పందన రాకపోయినా ఇప్పుడు బాగానే ఉంది అంటున్నారు. తెలంగాణ నేపథ్యంలో, చేనేత మీద వచ్చిన ‘మల్లేశం’ కథ.. పద్మశ్రీ పురస్కార గ్రహీత, లక్ష్మీ ఆశు మెషీన్ సృష్టికర్త చింతకింది మల్లేశం బయోపిక్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రంతో ఎన్నారై అయిన రాజ్ రాచకొండ తెలుగు తెరకు దర్శకనిర్మాతగా పరిచయమయ్యారు. ఇప్పుడు ‘8 ఎఎం మెట్రో’తో బాలీవుడ్‌కి వెళ్లారు.

గుల్షన్‌ దేవయ, సయామీ ఖేర్‌, కల్పిక గణేశ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం త్వరలో ఇతర ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్‌ చేస్తారని సమాచారం. ఈ సినిమాలో కవితలను ప్రముఖ గీత రచయిత గుల్జార్ రచించారు. త్వరగా ఎమోషనల్‌ అయిపోయే ఓ మహిళకు మెట్రో రైలులో ఓ కుర్రాడు పరిచయం అవుతాడు. ఆ తర్వాత వాళ్ల లైఫ్‌లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేదే కథ.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus