‘అన్‌ఫినిష్డ్‌’ లోపల పేజీల్లో ఇంకా ఏమేం ఉన్నాయో

చిత్ర పరిశ్రమ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతుంది అంటుంటారు. అయితే అందులో అవకాశాలు మాత్రం అంత సులభంగా రావు. కొందరికి కష్టాలనే పరీక్షలు దాటాక అవకాశం వస్తే, ఇంకొందరికి వేదింపులు, ఈసడింపులు లాంటివి వచ్చాకనే అవకాశాలు వస్తాయి. వాటిని ఎదుర్కొని ముందుకుసాగేవాళ్లు పరిశ్రమలో నిలుస్తారు. తట్టుకోలేనివాళ్లు మధ్యలోనే నిష్క్రమిస్తారు. ఈ పోరులో నిలిచి విజయం సాధించినవాళ్లు తమ జీవితం గురించి చెప్పినప్పుడు సంచనాలు బయటికొస్తాయి. తాజాగా ప్రియాంక చోప్రా విషయంలో ఇదే జరుగుతోంది. ‘అన్‌ఫినిష్డ్’ పేరుతో ప్రియాంక తన ఆత్మకథను రాసుకొచ్చింది. అందులో విషయాలు సంచనాలకు వేదికవుతున్నాయి.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఇక్కడే కొనసాగాలనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అన్నింటినీ ఓర్చుకున్నానని ప్రియాంక చోప్రా అంటోంది. సాధారణమైన నటిగా ప్రారంభించి… ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగింది. ‘‘ప్రపంచ సుందరిగా 2000లో కిరీటాన్ని చేజిక్కించుకున్నాక నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. కెరీర్‌ కొత్తలో కొంతమంది దర్శకులు అసభ్యంగా మాట్లాడారు. పాట కోసం ఓ దర్శకుడు అయితే దుస్తులు తొలగించమన్నాడు. మరో దర్శకుడు అందం, శరీరాకృతికి సంబంధించిన సర్జరీలు చేయించుకోమన్నాడు’’ అంటూ షాకింగ్‌ విషయాలు రాసుకొచ్చింది ప్రియాంక.

‘‘పరిశ్రమలో నిలదొక్కుకోవడం కోసం చిరునవ్వుతో పరిస్థితులను దాటాలనేది నేర్చుకున్నాను. ప్రతి విషయంలోనూ ఓర్పు అవసరం తెలిసింది. దానికి కూడా కొన్ని కారణాలున్నాయి. స్వతహాగా నాకు చాలా భయాలున్నాయి. అభద్రతాభావం కూడా ఎక్కువగా ఉండేది. నేనేమన్నా అంటే ఎవరేమనుకుంటారో అని ఆలోచించేదాన్ని. అందుకే ఎవరేమన్నా పట్టించుకోకుండా నా పని నేను చేసుకునేదాన్ని’’ అని చెప్పింది ప్రియాంక చోప్రా. పిగ్గీ చాప్స్‌ జోరు చూస్తుంటే ఈ పుస్తకం ఇంకా చాలా సంచనాలు బయటపెట్టేలా ఉంది. ‘అన్‌ఫినిష్డ్‌’ లోపల పేజీలు.. బీటౌన్‌లో గుబులు రేపుతోందట.

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus