Vishwambhara: చరణ్, రవితేజ, సుశాంత్ అయిపోయారు.. నెక్స్ట్ ఎవరు?

మెగాస్టార్ చిరంజీవి గతేడాది ‘వాల్తేరు వీరయ్య’ తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కానీ అదే ఏడాది చేసిన ‘భోళా శంకర్’ నిరాశపరిచింది. అయితే చిరు గత 3,4 సినిమాల నుండీ చూసుకుంటే.. ఇంకో హీరో కూడా ఉండేలా కథలు ఉంటున్నాయి. ‘ఆచార్య’ లో చరణ్ నటించాడు, ‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్ ఖాన్ నటించాడు, ‘వాల్తేరు వీరయ్య’ లో రవితేజ చేశాడు, ‘భోళా శంకర్’ లో సుశాంత్ నటించడం చూశాం.

అయితే తర్వాత కళ్యాణ్ కృష్ణతో అనుకున్న సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ చేయాలి. కానీ ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది. ప్రస్తుతం చిరు ‘బింబిసార’ దర్శకుడు మల్లిడి వశిష్ట్ తో ఓ సోసియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే కథ ప్రకారం ఈ సినిమాలో ఇంకో హీరోకి కూడా స్కోప్ ఉంటుందట.ఓ యంగ్ హీరోకి సూట్ అయ్యే పాత్ర అది అని తెలుస్తుంది. ఆ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందట.

అయితే ఆ యంగ్ హీరో పాత్ర ఎవరు చేస్తారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ‘యూవీ క్రియేషన్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంస్థలో యంగ్ హీరో సంతోష్ శోభన్ ఎక్కువ సినిమాలు చేశాడు. ఇదే బ్యానర్లో అతను ఇంకో 2 సినిమాలు చేయాలి. అతన్ని ఎంపిక చేసుకునే ఛాన్స్ అయితే లేకపోలేదు. కానీ (Vishwambhara) చిత్ర బృందం ఫైనల్ గా ఏ డెసిషన్ తీసుకుంటుందో చూడాలి

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus