నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన అంటే సుందరానికి సినిమా థియేటర్లలో విడుదల కావడానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. సాధారణంగా నాని సినిమా అంటే అడ్వాన్స్ బుకింగ్స్ బాగుంటాయనే సంగతి తెలిసిందే. అయితే అంటే సుందరానికి సినిమా విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతోంది. మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నా సింగిల్ స్క్రీన్ లలో మాత్రం బుకింగ్స్ ఆశించిన విధంగా లేకపోవడం గమనార్హం. అయితే ఈ సినిమాకు టికెట్ రేట్లను పెంచలేదని అదే సమయంలో టికెట్ రేట్లను తగ్గించలేదని తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సాధారణంగా అమలు చేస్తున్న టికెట్ రేట్లు ఈ సినిమాకు వర్తించనున్నాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ట్రైలర్ లో లేకపోవడం ఒకింత మైనస్ కాగా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బుకింగ్స్ లో వేగం పెరుగుతుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాలలో అంటే సుందరానికి సినిమాకు బుకింగ్స్ ఇంకా మొదలుకాలేదు. నజ్రియా అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎఫ్3 సినిమాకు కూడా టికెట్ రేట్లను పెంచడం తగ్గించడం చేయలేదు. నాని కూడా అంటే సుందరానికి సినిమా విషయంలో ఎఫ్3ను ఫాలో అవుతున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. నాని ఈ సినిమాలో బ్రాహ్మణ యువకుడి పాత్రలో నటించారు. యూత్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ సాధించాలని నాని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
నాని ఈ సినిమా కొరకు 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే నాని రెమ్యునరేషన్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సినిమాసినిమాకు నానికి క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!