నేచురల్ నాని హీరోగా నజ్రియా ఫహాద్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ!’. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 10న ఈ చిత్రం తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో ఈ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఈ చిత్రంలో కామెడీ ఫుల్ గా ఉంటుంది అనే ప్రామిస్ చేసాయి టీజర్, ట్రైలర్లు.
దాంతో ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :
నైజాం | 12.00 cr |
సీడెడ్ | 4.00 cr |
ఉత్తరాంధ్ర | 2.50 cr |
ఈస్ట్ | 1.60 cr |
వెస్ట్ | 1.30 cr |
గుంటూరు | 1.50 cr |
కృష్ణా | 1.40 cr |
నెల్లూరు | 0.70 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 25.00 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.20 cr |
ఓవర్సీస్ | 3.10 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 30.30 cr |
‘అంటే సుందరానికీ!’ చిత్రానికి రూ.30.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.31 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. నాని మార్కెట్ కు ఈ టార్గెట్ ఈజీనే..! కాకపోతే హిట్ టాక్ వస్తేనే ఈ టార్గెట్ ను రీచ్ అవ్వడం వీలవుతుంది. అసలే ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి.
అలాగే ‘మేజర్’ ‘విక్రమ్’ వంటి చిత్రాలు ఇంకా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా రన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘అంటే సుందరానికీ!’ చిత్రం ఎంత వరకు రాబడుతుంది అనే విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే డల్ గా ఉన్నాయి. టాక్ ను బట్టి ఏమైనా పికప్ అవుతాయేమో తెలియాల్సి ఉంది.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!