నెమ్మదిగా వెళ్తున్నా సంతోషమే : అను ఇమ్యానుయేల్

అమెరికాలో పుట్టి పెరిగిన అను ఇమ్యానుయేల్ మజ్ను సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా ఛాన్స్ అందుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసిలో హీరోయిన్ గా నటించింది. అలాగే స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్య కోసం కష్టపడింది. వీటితో పాటు ఆక్సిజన్ కూడా ఆమె కెరీర్ కి బ్రేక్ ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో శైలజారెడ్డి అల్లుడు మూవీ చేస్తోంది. ఇందులో అను నాగచైతన్యకి జోడీగా నటిస్తోంది. ఈ షూటింగ్ వేగంగా సాగుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె అనేక సంగతులు వెల్లడించింది. “నేను నెమ్మదిగా వెళ్తున్నాను అని అందరూ అడుగుతున్నారు.

నాకు అలా అనిపించడం లేదు. ఒకే సమయంలో అనేక సినిమాలు చేయాలనీ లేదు. పరిగెత్తాల్సిన పనిలేదు. నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ పోతే చాలు. ప్రస్తుతం నా కెరీర్ గురించి సంతోషంగానే ఉన్నాను” అని అను తనపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టింది. ఇక శైలజా రెడ్డి సినిమా గురించి మాట్లాడుతూ… “‘శైలజారెడ్డి అల్లుడు’లో నా క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే నేను ప్రేక్షకులకు కొత్తగా కనిపిస్తాను. కొంచెం ఈగో ఉన్న అమ్మాయిగా తప్పకుండా మీ మనసులు దోచుకుంటాను” అని చెప్పింది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. రమ్యకృష్ణ అత్తగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus