Anu Emmanuel: లవ్ ఎఫైర్ రూమర్లపై స్పందించిన నటి అను ఇమ్మానుయేల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటిస్తూ హీరోయిన్ గా సందడి చేసినటువంటి వారిలో నటి అను ఇమ్మానుయేల్ ఒకరు. మలయాళ చిత్ర పరిశ్రమ ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైనటువంటి ఈమె తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈమె అల్లు అర్జున్ అల్లు శిరీష్ వంటి హీరోల సరసన నటించిన ఈమెకు మాత్రం అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదని చెప్పాలి.

ఇకపోతే తాజాగా ఈమె నటించిన జవాన్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అను ఇమ్మానుయేల్ మాట్లాడుతూ గతంలో తన గురించి వచ్చినటువంటి లవ్ ఎఫైర్ రూమర్స్ గురించి స్పందించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ హీరో పేరు ప్రస్తావించకుండా తాను గతంలో ఒక హీరోతో కలిసి ఓ సినిమా చేశాను ఆ సినిమా సమయంలో తనతో ప్రేమలో పడ్డాను అంటూ నా గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.

తాను పెద్దగా వార్తలను ఫాలో కానని కానీ ముందుగా మా అమ్మ చదివి నా గురించి ఇలాంటి వార్తలు వస్తున్నాయి అంటూ తనకు చెప్పిందని ఈమె తెలియజేశారు. అందరూ అనుకున్న విధంగా ఆ హీరోతో నాకు ఎలాంటి సంబంధం లేదని సినిమా పరంగా మాత్రమే ఆయనతో రొమాంటిక్ సన్నివేశాలలో నటించానని అను ఇమ్మానుయేల్ (Anu Emmanuel) తెలిపారు.

మీరు అనుకునే సంబంధం మా మధ్య లేదని అదే విధంగా ఆ హీరో కుటుంబంలోని మరొక హీరోతో కూడా తాను సినిమా చేశాను అంటూ ఈ సందర్భంగా అల్లు శిరీష్ పేరు ప్రస్తావనకు తీసుకురాకుండా లవ్ రూమర్స్ గురించి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈమె అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus