రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్ల పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన చిత్రం ‘అనుభవించు రాజా’. నవంబర్ 26న విడుదలైన ఈ చిత్రానికి పర్వాలేదనిపించే టాక్ వచ్చింది.దాంతో వీకెండ్ వరకు కలెక్షన్లు పర్వాలేదు అనిపించింది. కానీ వీక్ డేస్ లో మాత్రం ఈ చిత్రం కలెక్షన్లు పూర్తిగా డౌన్ అయ్యాయి.ఆ పై నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను ల ‘అఖండ’ రావడం అది బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో రాజ్ తరుణ్ సినిమాని పట్టించుకున్న వాళ్ళు లేరు.దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది.
ఓసారి క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 0.72 cr |
సీడెడ్ | 0.44 cr |
ఉత్తరాంధ్ర | 0.27 cr |
ఈస్ట్ | 0.19 cr |
వెస్ట్ | 0.15 cr |
గుంటూరు | 0.21 cr |
కృష్ణా | 0.16 cr |
నెల్లూరు | 0.13 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.27 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.15 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 2.42 cr |
‘అనుభవించు రాజా’ చిత్రానికి రూ.3.90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.సో బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.2.42 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసింది. దాంతో బయ్యర్లకి బిజినెస్ పై రూ.1.48 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తుంది. ఫైనల్ గా ఈ చిత్రం రాజ్ తరుణ్ కెరీర్లో మరో ప్లాప్ గా మిగిలినప్పటికీ..
ఓపెనింగ్స్ విషయంలో అతనికి కొంత ఊరటనిచ్చింది అని చెప్పాలి. ఓటిటి ఆఫర్స్ ఎన్ని వచ్చినా కాదని చాలా రోజులు వెయిట్ చేసి ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేశారు. డిసెంబర్ 17నుండీ ఈ చిత్రం ఆహాలో స్ట్రీమ్ కానుంది.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!