Anudeep: తమిళ్‌లో అదృష్టం పరీక్షించుకోనున్న అనుదీప్‌!

తొలి సినిమా ‘పిట్టగోడ’తో సరైన విజయం అందుకోకపోయినా… రెండో సినిమా ‘జాతిరత్నాలు’ సరైన హిట్‌ అందుకున్నారు అనుదీప్‌. రెండో సినిమా విడుదలకు ముందు ఓ టీవీ షో ద్వారా మరింతగా తన కామెడీ టైమింగ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ మాటలు, పంచ్‌లను బేస్‌ చేసుకొని ‘జాతిరత్నాలు’ చూసిన ప్రేక్షకులు థ్రిల్‌ ఫీలయ్యారు. సరికొత్త కామెడీ సినిమా అంటూ ఆదరించారు. ఆ తర్వాత… ? అనుదీప్‌ కొట్టిన హిట్‌కి తర్వాత వరుస పెట్టి సినిమా అవకాశాలు వస్తాయేమో అనుకున్నారంతా.

అయితే అలాంటిదేం జరగలేదు. ఇప్పటివరకు సరైన సినిమా ఓకే అవ్వలేదు. రెండో సినిమా వైజయంతి మూవీస్‌లో చేయాల్సి ఉంది అనే మాట మాత్రం వినిపించింది. ఆ తర్వాత ఒకరిద్దరికి కథ చెప్పాడని తెలిసినా, స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా ఉంటుందని వార్తలొచ్చినా ఏవీ మెటీరియలైజ్‌ కాలేదు. తాజాగా అనుదీప్‌ కోలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడని వార్తలొస్తున్నాయి. శివకార్తికేయన్‌ను ఇటీవల అనుదీప్‌ కలిశాడని టాక్‌. ఏసియన్‌ సునిల్‌ కుమార్‌ నారంగ్‌ వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నారని వార్తలు ఉడుకుతున్నాయి.

ఇటీవల ఏసియన్‌ టీమ్‌ తమిళ హీరోలతో సినిమాలు చేయడానికి ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో శివకార్తికేయన్‌ – అనుదీప్‌ సినిమా ఉంటుందట. అంతేకాదు ఈ సినిమా తెలుగు – తమిళ భాషల్లో నిర్మిస్తారట.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus