Faria Abdullah: అనుదీప్ అందరితోనూ అలాగే ప్రవర్తిస్తాడు: ఫరియా అబ్దుల్లా

‘జాతిరత్నాలు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హైదరబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిట్టిగా చెరగని ముద్ర వేసుకుంది. తొలి సినిమాతోనే పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఫరియా ఆ తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ‘బంగార్రాజు’ వంటి చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేసింది. అయితే కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘లైక్ షేర్ సబ్ స్కెబ్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నవంబర్ 4 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది ఫరియా. ముఖ్యంగా ‘జాతి రత్నాలు’ షూటింగ్ టైంలో దర్శకుడు అనుదీప్ ఫరియా పై చెయ్యి చేసుకున్నాడు అంటూ గతంలో ప్రచారం నడించింది. ఈ విషయం పై కూడా ఫరియా క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ” నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓ ఈవెంట్ జరిగితే దానికి గెస్ట్ గా నాగార్జున వచ్చారు.

అప్పుడు ఆయన నన్ను చూసి మీరు యాక్టరా? అని అడిగారు. అప్పుడే ఆయన నెంబర్ తీసుకుని ఫాలో అప్ చేశాను. ఈ క్రమంలో ఆడిషన్స్ ఇవ్వగా ‘జాతి రత్నాలు’ సినిమాలో అవకాశం వచ్చింది. అటు తర్వాత ‘జాతి రత్నాలు’ షూటింగ్ సమయంలో డైరెక్టర్ అనుదీప్ నన్ను కొట్టారని వచ్చిన వార్తలు నా వరకు వచ్చాయి.

అయితే అది సరదాగా జరిగింది. సెట్లో అనుదీప్ చాలా సరదాగా ఉంటారు. ఆయన జోక్స్ వేసినప్పుడు నవ్వుతూ పక్కనున్న వాళ్లని కొడుతూ ఉంటారు. అలా ఒకసారి నన్ను చేతితో అలా సరదాగా కొట్టారు. అంతే’ బయటకు అది వేరేలా వచ్చింది” అంటూ ఫరియా చెప్పుకొచ్చింది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus