Anupama: టాలీవుడ్ లో అనుపమకు ఇష్టమైన హీరో ఆయనేనా?

టాలీవుడ్ క్యూట్ హీరోయిన్లలో ఒకరైన అనుపమ పరమేశ్వరన్ కు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో గుర్తింపు ఉంది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడం అనుమప కెరీర్ కు ప్లస్ అయింది. నిఖిల్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న అనుపమ కార్తికేయ2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

చిత్రయూనిట్ తీవ్రంగా శ్రమించి కార్తికేయ2 సినిమాను తెరకెక్కించిందని అనుపమ తెలిపారు. ఈ మూవీలో నా పాత్రకు కార్తికేయ2 రిలీజైన తర్వాత మంచి గుర్తింపు లభించే ఛాన్స్ అయితే ఉందని అనుపమ పేర్కొన్నారు. కార్తికేయ2 మూవీ కూడా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని అనుపమ చెప్పుకొచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాకు ఎంతో ఇష్టమైన నటుడు చిరంజీవి అని అనుపమ అన్నారు. చిరంజీవి సినిమాలను నేను ఎంతగానో ఇష్టపడతానని అనుపమ చెప్పుకొచ్చారు.

ఈ సినిమా కూడా మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని అనుపమ చెప్పుకొచ్చారు. చిరంజీవికి జోడీగా నటించే ఛాన్స్ దక్కితే వెంటనే ఓకే చెప్పేస్తానని ఆమె కామెంట్లు చేశారు. చిరంజీవి అనుపమ కాంబినేషన్ లో త్వరలో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. మరోవైపు అనుపమకు స్టార్ హీరోల సినిమాలలో ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉండటం కూడా అనుపమ కెరీర్ కు మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అనుపమ కార్తికేయ2, 18 పేజెస్ సినిమాలలో నటించగా కొన్ని నెలల గ్యాప్ లోనే ఈ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ2 తెరకెక్కగా ఈ నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సీనియర్ స్టార్ హీరోలకు జోడీగా నటించడానికి సిద్ధమేనని అనుపమ పరోక్షంగా చెబుతున్నారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus