Anupama: ‘టిల్లు’ బ్యూటీ తమిళ సినిమా ఓకే.. స్టార్‌ హీరో కొడుకుతో..!

టాలీవుడ్‌లోకి స్టార్‌ హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇన్‌స్టంట్‌గా స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను పొందింది అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) . అది కూడా ఇన్‌స్టంట్‌ హిట్‌ అయిన మలయాళ సినిమా ‘ప్రేమమ్‌’ (Premam) రీమేక్‌తో. అంతటి అవకాశాన్ని అందుకున్న అనుపమ ఆ తర్వాత ఆ స్థాయిలో సినిమాలు ఓకే చేయలేకపోయింది, ఒకవేళ చేసినా ఆశించిన విజయాలు అందుకోలేకపోయింది. దీంతో తన స్టైల్‌ కాని స్కిన్‌ షోకి, ముద్దు సీన్లకు ముందుకొచ్చింది. అయితే తరంతోపాటు మారాలి అనే మాట అంటే మనం ఏం చేయలేం.

‘రౌడీబాయ్స్‌’ తన రూటు సపరేటు అని నిరూపించుకున్న అనుపమ పరమేశ్వరన్‌… స్టార్‌ హీరోలోతోనే కాదు.. కొత్త కుర్రాళ్లతోనూ నటిస్తాను అని చెప్పకనే చెప్పింది. అయితే పెద్ద హీరోల సినిమాలు వదిలేయలేదు. ఈ క్రమంలో చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టిన తన రూటు మారింది అనే మాట మీద నిలబడే ఉంది. దీనికి పరాకాష్ట ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) అని అంటున్నారు. ఈ సినిమాలో ముద్దులు, హద్దులు చాలానే దాటింది అని ప్రచార చిత్రాలతో అర్థమవుతోంది. ఇలా టాలీవుడ్‌లో సాగుతుండగా తమిళ ఎంట్రీ ఇచ్చింది ఈ కేరళ అందం.

ధ్రువ్‌ విక్రమ్‌ హీరోగా మారి సెల్వరాజ్ ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఓ జీవిత కథతో రూపొందుతున్న ఈ సినిమాలో ధ్రువ్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ నటించనుంది. మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కబడ్డీ క్రీడాకారుడు మానతి పి.గణేశన్‌ జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారు. టైటిల్‌ రోల్‌ను తెరపై ధ్రువ్‌ పోషించనున్నాడు.

ఈ సినిమా కోసం ఇప్పటికే ధ్రువ్‌ కబడ్డీలో శిక్షణ తీసుకున్నాడు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది అని సమాచారం. ఈ సినిమాలోనే అనుపమ నటిస్తోంది. రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్‌ పాత్ర కాదని, నటనక ప్రాధాన్యమున్న పాత్ర అని అంటున్నారు. రూటు మార్చింది అని అంటున్న అనుపమ… ఈ సినిమాతో మరో రూటులోకి అంటే పర్‌ఫార్మెన్స్‌ రోల్‌ రూట్‌లోకి వెళ్తోంది అని చెబుతున్నారు.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus