Actress: వైరల్ అవుతున్న ప్రముఖ స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఈగల్ సినిమాలో కూడా అనుపమ నటిస్తుండటం గమనార్హం. అనుపమ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. కార్తికేయ2 సినిమా సక్సెస్ తో అనుపమకు ఇతర ఇండస్ట్రీలలో కూడా మంచి గుర్తింపు దక్కిందనే సంగతి తెలిసిందే.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎమోషన్స్ ను వ్యక్తపరిచే విషయంలో నేను చాలా నిజాయితీగా ఉంటానని ఆమె అన్నారు. ఏదైనా నచ్చని పక్షంలో ముఖం పైనే చెప్పేస్తానని అనుపమ తెలిపారు. ఎందుకంటే మన జీవితం చాలా చిన్నదని అనుపమ పరమేశ్వరన్ కామెంట్లు చేశారు. ఈ భూమిపై కొన్నాళ్లు ఉండటానికి వచ్చామని మళ్లీ వెళ్లిపోతామని ఆమె కామెంట్లు చేశారు.

అరోజు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదని అనుపమ పేర్కొన్నారు. బ్రతికి ఉన్న కొన్నిరోజులైనా మన ఒత్తిడిని దాచుకోవడానికి మన శక్తిని అనవసరంగా ఎందుకు వృథా చేయాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ నెల రోజుల తర్వాత ఆటోమేటిక్ గా ఏ విధంగా డిలీట్ అవుతుందో నా మెదడులోని చెత్తను కూడా అదే విధంగా డిలీట్ చేస్తానని అనుపమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అనుపమ (Actress) వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా అనుపమ భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. సక్సెస్ రేట్ పెరుగుతున్నా అనుపమ పారితోషికం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus