ఒకప్పుడు భారతీయ సినిమాలు అంటే కేవలం బాలీవుడ్ సినిమాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం భారతీయ సినిమాలంటే సౌత్ సినిమాలు అనే చెప్పుకునే స్థాయికి సౌత్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించడంలో విఫలమైందనే వార్తలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి.గత రెండు మూడు సంవత్సరాల నుంచి దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతూ నార్త్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన ఆదరణ సంపాదించుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరికెక్కిన సినిమాలు సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాగా ఈ సినిమాలో ప్రేక్షకులను సందడి చేయలేక బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ సినిమాలు సౌత్ లో ఆదరణ కోల్పోవడానికి గల కారణాలు గురించి ఇదివరకే ఎన్నోసార్లు ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా డైరెక్టర్ అనురాగ్ ఈ విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా అనురాగ్ మాట్లాడుతూ బాలీవుడ్ సినిమాలు హిట్ కాకపోవడానికి గల కారణాలను వెల్లడించారు.
హిందీ భాష రాణి వాళ్ళు సినిమాలు చేయటం వల్లే హిందీ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఈయన వెల్లడించారు. ఒక భాష పై పట్టు ఉండి ఆ భాషలో సినిమా చేస్తే ఆ సినిమా మూలాలను వెలికి తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. అయితే భాష పై పట్టు లేకపోవడం వల్ల ఇలా హిందీ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని దర్శకుడు వెల్లడించారు. ఎక్కువగా హిందీ భాష రాణి వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడుతూ ఈ సినిమాలను చేయటం వల్ల బాలీవుడ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అంటూ డైరెక్టర్ అనురాగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇకపోతే హిందీలో వచ్చిన గంగూబాయి కతియావాడి, భూల్ భూలయ్యా 2 సినిమాలు మాత్రమే హిట్అయ్యాయి. ఈ రెండు సినిమాలను సాధారణ సినిమాలు మాదిరిగానే చేయటం వల్ల ఇవి హిట్ అయ్యాయి. ఇతర సినిమాలన్నీ కూడా కొత్త ప్రయత్నాలు చేయడం వల్ల ఈ సినిమాలు విజయం సాధించలేకపోయాయని ఈ సందర్భంగా అనురాగ్ బాలీవుడ్ సినిమాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!