Aaliyah: మనసైనవాడిని పరిచయం చేసిన ఆలియా… త్వరలోనే పెళ్లి!

విక్రమ్‌, అతని ఫ్యాన్స్‌తో పంచాయితీ పెట్టుకుని ఓవైపు తండ్రి బిజీగా ఉంటే.. మరోవైపు పెళ్లి కబురు చెప్పి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది ఆ డైరక్టర్‌ కూతురు. ఇప్పటికే అర్థమైపోయుంటుంది మేం ఎవరి గురించి చెబుతున్నామో. వాళ్లే బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, ఆయన కుమార్తె ఆలియా కశ్యప్‌ గురించే. ‘కెన్నెడీ’ సినిమా విషయంలో విక్రమ్‌తో జరిగిన పాత విషయాలను చెప్పి అనురాగ్‌ కశ్యప్‌ వార్తల్లోకి రాగా… మనసైన వాడితో వివాహం చేసుకుంటున్నాను అంటూ ఆలియా వార్తల్లోకి వచ్చింది.

స్నేహితుడు షేన్‌ను వివాహం చేసుకుంటున్నాను.. ఇదిగో మా నిశ్చితార్థం ఉంగరం అంటూ (Aaliyah) ఆలియా ఓ ఫొటో పోస్ట్‌ చేశారు. దాంతోపాటు ఇద్దరూ ముద్దుల్లో మునిగితేలిన ఫొటోను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇండోనేషియాలోని బాలి వేదికగా వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారట. ‘‘నా బెస్ట్‌ ఫ్రెండ్‌, పార్ట్‌నర్‌, సోల్‌మేట్‌ అయిన షేన్‌ ఇప్పుడు నాకు కాబోయే భర్త’’ అని రాసుకొచ్చారు ఆలియా. నిజమైన, అపరిమితమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు చూపించినందుకు షేన్‌కు నా ధన్యవాదాలు.

నీకు యస్‌ చెప్పడమే.. నేను చేసిన అత్యంత ఈజీ పని. నా జీవితాన్ని నీతో కలిసి గడిపేందుకు ఎదురుచూస్తున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ సోషల్‌ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చారు ఆలియా. ఆమె పోస్ట్‌ను చూసిన సినీ తారలు అభినందనలు చెబుతున్నారు. ఆలియా – షేన్‌ జంటకు అనన్యా పాండే, సన్నీ లియోనీ, జాన్వీ కపూర్‌, శోభితా ధూళిపాళ్ల కంగ్రాట్స్‌ చెప్పారు. ఆలియా – షేన్‌ ఓ డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమయ్యారట.

ఆ తర్వాత కొన్ని నెలలకే మంచి స్నేహితులయ్యారట. కుటుంబసభ్యుల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. అనురాగ్‌ కశ్యప్‌ బాలీవుడ్‌లో దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా, స్క్రీన్‌ రైటర్‌గా ప్రసిద్ధి. ‘బాంబే టాకీస్‌’, ‘బాంబే వెల్వెట్‌’, ‘లస్ట్‌ స్టోరీస్‌’, ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’, ‘దోబారా’ చిత్రాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘కెన్నెడీ’ సినిమా కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైన విషయం తెలిసిందే.

 

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus