మాధవన్ తో మరోసారి జతకడుతున్న అనుష్క

“భాగమతి” అనంతరం అనుష్కను ఆన్ లైన్ లో చూడడం తప్ప.. ఆన్ స్క్రీన్ చూసే అవకాశాన్ని ఆమె అభిమానులు ఆల్మోస్ట్ కోల్పోయారు అనుకొనే సమయంలో మొన్నామధ్య ఆమె ఒక యాక్షన్ థ్రిల్లర్ సైన్ చేసిందనే వార్తలు అనుష్క అభిమానులకు కొత్త ఆశలు చిగురించేలా చేశాయి. అయితే.. ముందు వార్తోలొచ్చినట్లుగా అది గోపీచంద్ సినిమా కాదట. మంచు విష్ణు హీరోగా అప్పుడెప్పుడో “వస్తాడు నా రాజు” అనే చిత్రాన్ని తెరకెక్కించిన హేమంత్ మధుకర్ అనే దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో.. ఈ యాక్షన్ థ్రిల్లర్ అనుష్క సైన్ చేసిన విషయం వాస్తవమే కానీ.. గోపీచంద్ మాత్రం హీరో కాదని కన్ఫర్మ్ అయ్యింది.

ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించబోతోంది మాధవన్ అని తెలిసిందే. ఆల్రెడీ మాధవన్ తో అనుష్క “రెండు” అనే సినిమా చేసింది. అది కూడా కెరీర్ తొలినాళ్లలో.. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మాధవన్ తో రెండో సినిమా చేసే అవకాశం రావడంతో తెగ సంతోషపడిపోతోందట అనుష్క. ఈ ప్రొజెక్ట్ ను ఇంటెర్నేషనల్ లెవెల్ లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తునానడట హేమంత్. అందుకే హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కూడా సినిమా కోసం ఎన్నుకొనే పనిలో ఉన్నాడట. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం తెరకెక్కనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus