Vamika: అనుష్క, విరాట్ కూతురి ఫిక్స్ వైరల్.. ఎవరి పోలికలంటే?

ఒకరు స్టార్ క్రికెటర్ మరొకరు వెండితెరపై స్టార్ హీరోయిన్.. వీరి మధ్యలో ఎప్పుడు ప్రేమ చిగురించిందో గాని ఈ జంట అభిమానులకు మాత్రం చాలా బాగా ఎట్రాక్ట్ చేసింది. ఇండియన్ మోస్ట్ బ్యూటీఫుల్ సెలబ్రెటీ కపుల్స్ లో విరుష్క టాప్ లిస్ట్ లో ఉంటారని చెప్పవచ్చు. కోహ్లీ ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఫ్యామిలీ లైఫ్ ను ఏ మాత్రం మిస్సవ్వడు. ఇక కూతురు జన్మించిన తరువాత కోహ్లీ బాధ్యత మరింత పెరిగింది.

కూతురు వమికా కోహ్లీ కోసం ప్రత్యేకంగా సెక్యూరీటి కూడా పెంచాడు. అంతే కాకుండా తనకు సంబంధించిన ఫొటోలను కూడా బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఏడాది జనవరి 11న జన్మించిన వమికా ఇటీవల మొదటి ఏడాదిని పూర్తి చేసింది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి పార్టీలు లేకుండా మొదటి పుట్టినరోజును ముగించారు. ఇక వమికా కోహ్లీ జన్మిముచినప్పటి నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఒక్క ఫొటోను కూడా విడుదల చేయలేదు.

ఇక అధివారం మాత్రం వమికాకు సంబంధించిన ఫొటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి తన కూతురికి కానుకగా అన్నట్లు సైగలు చేశాడు. అప్పుడే డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన అనుష్క తన కూతురిని కూడా ఎత్తుకొని వచ్చింది. వమికాకు తండ్రిని చూపిస్తూ అనుష్క సంబరపడింది. ఇక వమికా అచ్చు గుద్దినట్లు విరాట్ కోహ్లీ పొలకలతో ఉన్నట్లుగా అర్ధమయ్యింది.

అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతవరకు కూతురి ప్రైవసీ కోసమే సోషల్ మీడియాలో కూడా ఆమె ఫొటోను పోస్ట్ చేయలేదు. బయటకు వెళ్లినా కూడా భారీ భద్రత నడుమ విరుష్క వారి కూతురి ఫొటోలు ఎవరు తీయకుండా చూసుకున్నారు. ఇక క్రికెట్ మ్యాచ్ లో ఒక్కసారిగా కెమెరాలు అటువైపు ఫోకస్ చేయడంతో మొదటిసారి వమికా మొహం అందరూ చూసేశారు. దీంతో అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus