Anushka Sharma, Virat Kohli: వరల్డ్ కప్ మిస్ అవ్వడంతో భర్తను ఒదారుస్తున్న అనుష్క శర్మ!

కోట్ల మంది భారతీయులు చూపు వరల్డ్ కప్ పైనే ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఆదివారం జరిగినటువంటి ఈ వరల్డ్ కప్ మ్యాచ్లో తప్పకుండా ఇండియా గెలుస్తుందని ఈసారి కప్పు మనదే అని ఎంతో మంది ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ వరల్డ్ కప్ మ్యాచ్ మొదలైనప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క భారతీయుడులో ఏదో తెలియని కంగారు ఉందనే విషయం మనకు తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా వాళ్లు పక్కా ప్లాన్ తో బరిలోకి దిగి కప్పు గెలుచుకున్నారు.

ఈ విధంగా వరల్డ్ కప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓటమి పాలు కావడంతో ఎంతో మంది భారతీయులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలుచుకోవడంతో క్రికెటర్లు సైతం ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఇలా ఈసారి కూడా వరల్డ్ కప్ మిస్ కావడంతో విరాట్ కోహ్లీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆయన సతీమణి బాలీవుడ్ నటి అనుష్క తన భర్తకు మద్దతుగా నిలిచారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక భారీగా తన భర్తకు పూర్తిగా మద్దతు తెలియజేస్తూ తనని ఓదార్చడమే కాకుండా తన భర్తకు మద్దతుగా నిలబడటంతో (Anushka Sharma) అనుష్క శర్మ పై ప్రశంసల కురిపిస్తున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటోలపై స్పందిస్తూ ఇలా భర్తకు మద్దతుగా భార్య నిలబడటం చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ చేయగా అసలైన ప్రేమ ఇదే కదా అంటూ మరికొందరు ఈ ఫోటో పై కామెంట్ చేస్తున్నారు.

ఈ వరల్డ్ కప్ మ్యాచ్లో తప్పకుండా విజయం మనదేనని ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు భావించి ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు సైతం స్టేడియం చేరుకొని మ్యాచ్ ఎంజాయ్ చేయాలని స్టేడియంకి తరలి వెళ్లారు. కానీ అక్కడ కొంత పాటి నిరాశ ఎదురైందని చెప్పాలి. ఇక ఇండియా కప్పు గెలవకపోయిన ఫైనల్స్ వరకు చేరుకోవడం గ్రేట్ అంటూ పలువురు టీమిండియా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus