Anushka Shetty: అనుష్క మరో అరుంధతి.. ఎంతవరకు వచ్చిందంటే..!
- October 18, 2024 / 07:47 PM ISTByFilmy Focus
హీరోయిన్స్ లలో ప్రస్తుతం టాప్ రేంజ్ క్రేజ్ తో దూసుకుపోతున్న వారిలో సూపర్ స్టార్ అనుష్క (Anushka Shetty) ఒకరు. గతేడాది వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) తో ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత అనేక ఆఫర్లు వచ్చినప్పటికీ, తగిన కథ కోసం ఆమె కాస్తా వేచి చూశారు. ఇటీవల మలయాళంలో తన తొలి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సినిమా అరుంధతి (Arundhati) రేంజ్ లోనే ఉంటుందట.
Anushka Shetty

హిస్టారికల్ హారర్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ‘కథనాల్ – ది వైల్డ్ సోర్సెరర్’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ లో అనుష్క కీలక పాత్రలో నటిస్తోంది. జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఈ చిత్రానికి రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

శ్రీ గోకుల్ మూవీస్ బ్యానర్ పై గోకుల్ గోపాలన్ ఈ సినిమాను ఏకంగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. 9వ శతాబ్దంలో క్రైస్తవ మతగురువు కడమత్తత్తు కథనార్ జీవితం ఆధారంగా ఈ చిత్ర కథని పి రామానంద్ రాశారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుందనీ, ప్రేక్షకులను థ్రిల్ చేసే ఎలిమెంట్స్ తో సినిమాను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అనుష్క పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతుండటంతో, ఈ చిత్రంపై తెలుగు, తమిళ భాషల్లో కూడా మంచి హైప్ ఏర్పడింది.

‘నిశ్శబ్దం’ (Nishabdham) తర్వాత అనుష్క నుంచి రాబోతున్న పాన్ ఇండియా సినిమా ఇదే. అనుష్కకు మంచి క్రేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. వచ్చే ఏడాది విడుదలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇక అనుష్క ప్రస్తుతం క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో ‘ఘాటీ’ అనే మరో ప్రాజెక్ట్ లో కూడా నటిస్తోంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతుండటం విశేషం.












