‘ఏజెంట్’ (Agent) సినిమాతో నెవ్వర్ బిఫోర్ అనేలా విజయాన్ని అందుకుంటాడాని అనుకున్న అఖిల్ (Akhil Akkineni) ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఆ సినిమా కనీసం ఓటీటీ లో కూడా దర్శనమివ్వలేదు. ఆ దెబ్బతో అఖిల్ స్లో అయిపోయాడు. అప్పటి నుంచి తదుపరి ప్రాజెక్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కథలు వింటున్నప్పటికీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో, ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు చర్చగా మారాయి. ఇక ముందుగా యువీ క్రియేషన్స్ లో అనిల్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయాలని అనుకున్నా, దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో అది ఫైనల్ కాలేదు.
Akhil Akkineni
అదే సమయంలో, పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కూడా అఖిల్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించినా, పెద్దగా ప్రోగ్రెస్ లేకపోయింది. ఈ పరిస్థితుల్లో అఖిల్ తదుపరి ప్రాజెక్ట్ గురించి పెద్దగా అంచనాలు లేకుండానే ఉన్నారు. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం, అఖిల్ కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈసారి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) దర్శకుడు మురళీ కిషోర్‌తో కలిసి పని చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ కథని స్వయంగా నాగార్జున (Nagarjuna) ఎంచుకున్నారని, ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని పర్సనల్‌గా హ్యాండిల్ చేస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమా తిరుపతి నేపథ్యంలో పీరియడ్ డ్రామాగా ఉండనుంది. సినిమా ఖర్చు విషయంలో రాజీ పడకూడదని స్వయంగా నాగ్ ముందుకు వచ్చి పర్యవేక్షిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. గతంలో అఖిల్ బిగ్ ప్రొడక్షన్ లలోనే సినిమాలు చేశాడు.
కానీ ఈసారి నాగ్ ఎవరిని నమ్మలేక సొంత నిర్మాణంలో కొడుకు కోసం మంచి ప్రాజెక్టును డిజైన్ చేయాలని చూస్తున్నాడు. సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే, పీరియడ్ డ్రామా కాబట్టి ఈసారి అఖిల్ కు మరింత హార్డ్ వర్క్ అవసరం అవుతుంది. క్లిక్కయితే రామ్ చరణ్ కు (Ram Charan) రంగస్టులం (Rangasthalam) మాదిరిగా అఖిల్ కు కూ ఈ ప్రాజెక్టు బూస్ట్ ఇస్తుందేమో చూడాలి.