Anushka: అనుష్క బెస్ట్ కో స్టార్ అతనేనా..మరి ప్రభాస్ కాదా?

వెండితెర జేజమ్మగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క ఈ మధ్యకాలంలో వెండితెరకు పూర్తిగా దూరమయ్యారు. బాహుబలి సినిమా తరువాత అనుష్క నిశబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.ఈ సినిమా తరువాత అనుష్క ఎలాంటి సినిమాల ద్వారా ముందుకు రాలేదు.ఇకపోతే ఈమె వెండితెరకు దూరం కావడంతో ఇకపై సినిమాలు చెయ్యరని భావించారు. ఇకపోతే నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో అనుష్క నవీన్ పోలిశెట్టికి జోడిగా నటిస్తుందని వార్తలు వచ్చాయి.

ఈ సినిమాని మూవీ క్రియేషన్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు అనుష్క సినిమా సెట్ లోకి అడుగు పెట్టలేదు. అయితే ఇందులో ఈమె నటిస్తున్నారా లేదా అనే విషయం గురించి అందరికీ సందేహం ఉండేది.ఇకపోతే అనుష్క జులై 20వ తేదీకి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 సంవత్సరాలు పూర్తి కావడంతో హీరో నవీన్ పోలిశెట్టి ఆమెను సర్ప్రైజ్ చేశారు.ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి అనుష్క సినిమా షూటింగ్లో పాల్గొనబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.

అదేవిధంగా ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి 17 సంవత్సరాలు పూర్తి కావడంతో నవీన్ పోలిశెట్టి, యూవీక్రియేషన్ సంస్థ సెలెబ్రేట్ చేశాయి. మూవీ సెట్స్ లో కేక్ కట్ చేశారు. ఈ క్రమంలోని ఈ విషయాన్ని నవీన్ పోలి శెట్టి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే నవీన్ పోలిశెట్టి అనుష్కకు చిన్న కేక్ లంచంగా ఇచ్చి దానిపై 17 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ రాసుకొచ్చారు.ఈ విషయాన్ని ఈయన షేర్ చేస్తూ ఈ 17 సంవత్సరాల జర్నీకి కంగ్రాట్స్ అని చెప్పడమే కాకుండా అనుష్క ఈ సినీ కెరియర్లో తానే బెస్ట్ కోస్టార్ అని చెప్పింది

అంటూ నవీన్ పోలిశెట్టి వెల్లడించారు. అయితే అనుష్క బెస్ట్ కోస్టర్ నవీన్ పోలిశెట్టి అని ఆయనే సరదాగా చెప్పుకున్నారు. మా షూటింగ్ చాలా ఫన్ గా కొనసాగుతోంది. మొత్తానికి అప్డేట్ ఇచ్చేశా అని నవీన్ పోలిశెట్టి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అనుష్క పలు సందర్భాలలో తన బెస్ట్ కో స్టార్ ప్రభాస్ అని చెప్పిన విషయం మనకు తెలిసిందే.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus