Anushka, Shriya: సూపర్‌ హిట్‌ సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన డైరక్టర్‌!

రవితేజ ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నప్పుడు వచ్చి మంచి విజయం అందుకున్న చిత్రం ‘డాన్‌ శీను’. రవితేజను అమితాబ్‌ అభిమానిగా, ఫుల్‌ మాస్‌గా, కామెడీని పర్‌ఫెక్ట్‌ మిక్స్‌ చేసి తీసిన చిత్రమది. గోపీచంద్ మలినేని డెబ్యూ సినిమా ఇది. సుమారు 12 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు దర్శకుడు గోపీచంద్‌ మలినేని. ఆ సినిమాలో హీరోయిన్‌ గురించి ఈ విషయం చెప్పాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆ సినిమాలో నాయికగా మనం అనుష్కను చూసేవాళ్లం.

‘డాన్‌ శీను’ సినిమాలో కథానాయికగా శ్రియ నటించింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ పాత్ర కోసం తొలుత అనుష్కను అనుకున్నారట. ఈ కథ వినిపించి, ఓకే చేయించుకోవడానికి అనుష్కను కలిశారట గోపీచంద్‌ మలినేని. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సూర్య ‘ఈటి’ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ విషయం చెప్పారు గోపీచంద్‌ మలినేని. ‘సింగం’ సినిమా షూటింగ్‌ టైమ్‌లో జరిగిన ఓ విషయం గురించి చెబుతూ ఈ విషయం బయటికొచ్చింది.

కారైకుడిలో ‘సింగం’ సినిమాలో థియేటర్‌ దగ్గర ఫైట్‌ జరుగుతున్నప్పుడు గోపీచంద్‌ వెళ్లారట. అనుష్కను ‘డాన్‌ శీను’ కోసం తీసుకోవాలనేది ఆయన ఆలోచన అట. ఆ సమయంలో సూర్య.. గోపీచంద్‌తో పది నిమిషాలు ఆప్యాయంగా మాట్లాడరట. అంత పెద్ద స్టార్‌ అయి ఉండి తనతో అంతలా మాట్లాడటం చాలా బాగా అనిపించిందని చెప్పుకొచ్చారు గోపీచంద్‌. ‘సింగం’ సినిమా తనకు బాగా ఇష్టమని చెబుతూ, మాట్లాడుతూ ఆనందపడిపోయాడు. అయితే ‘డాన్‌ శీను’లో అనుష్క ఎందుకు నటించలేదు అనే విషయం మాత్రం తెలియదు.

కథ నచ్చలేదా, లేక డేట్స్‌ కుదరలేదా ఇంకే కారణంతోనైనా నటించలేదా అనేది తెలియదు. ఈసారి గోపీచంద్‌ మీడియా ముందుకు వచ్చినప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇక గోపీచంద్‌ మలినేని సినిమాలు చూస్తే… బాలకృష్ణ – మైత్రీ మూవీ మేకర్స్‌ కాంబోలో సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. సినిమా ఫస్ట్‌లుక్‌ కూడా రిలీజ్‌ చేశారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus