Anushka: డిఫరెంట్ రోల్ లో అనుష్క!

  • June 23, 2021 / 03:56 PM IST

‘బాహుబలి’ సినిమాతో అనుష్కకు నేషనల్ వైడ్ గా గుర్తింపు వచ్చింది. పాన్ ఇండియా హీరోయిన్ గా మారడంతో ఇకపై ఆమె నుండి వరుస సినిమాలు వస్తాయని అందరూ భావించారు. కానీ ఆమె బరువు పెరగడం వలన సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. స్పెషల్ వర్కవుట్లు, యోగా అంటూ చాలా సమయం వాటిపైనే వెచ్చించింది. దీంతో సినిమాల సంఖ్య బాగా తగ్గింది. ‘బాహుబలి’ తరువాత ‘భాగమతి’ అలానే ‘నిశ్శబ్దం’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

‘భాగమతి’ బాగానే ఆడినప్పటికీ.. ఓటీటీలో విడుదలైన ‘నిశ్శబ్దం’కి మాత్రం దారుణమైన రిజల్ట్ వచ్చింది. దీతో గ్యాప్ తీసుకొని తదుపరి సినిమాకి సిద్ధమైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనుష్క తన తదుపరి సినిమా కోసం సరికొత్త అవతారంలో కనిపించబోతుందని తెలుస్తోంది. కథ ప్రకారం అనుష్క కవల పిల్లలకు తల్లిగా కనిపించబోతుంది. సినిమాలో ఆమె సింగిల్ మదర్ గా కనిపిస్తుందని అంటున్నారు. పెళ్లి అయిన కొన్ని రోజులకే భర్త చనిపోవడం..

అప్పటికే ఆమె గర్భవతి అవ్వడంతో.. కవలలను కని వారిని పెంచుతూ సమాజంలో ఆమె ఎదుర్కొనే సవాళ్లను ఆసక్తికరంగా చూపించబోతున్నారట. సింగిల్ పేరెంట్ గా ఆడవాళ్లు ఈ సమాజంలో పడుతున్న ఇబ్బందులను.. వారి మానసిక క్షోబను ఈ సినిమాలో చూపిస్తారట.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus