విడుదలకు సిద్ధమవుతోన్న అనుష్క కొత్త లుక్
- August 17, 2017 / 11:39 AM ISTByFilmy Focus
స్వీటీ అనుష్క ఏ పాత్ర చేసినా.. ఆ క్యారక్టర్ పేరు అందరి నోటా మారుమోగాల్సిందే. అరుంధతి, రుద్రమదేవి, దేవసేన.. ఇలా పేరు చెప్పగానే అనుష్క గుర్తొకొస్తుంది. అలాంటి క్యారక్టర్ లో మరోసారి మెరవనుంది. బాహుబలి తర్వాత అనుష్క చేస్తున్న ఏకైక సినిమా భాగమతి. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మొన్ననే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుష్క క్యారక్టర్, లుక్ కి సంబంధించిన వివరాలు ఏవి బయటికి రాలేదు. ఆమె లుక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
భాగమతి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని వినాయక చవితికి విడుదల చేయాలనీ చిత్ర బృందం ఫిక్స్ అయింది. ఈ పండుగకు వారం రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున ఆమె లుక్ కి మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. తెలుగు తో పాటు తమిళం, హిందీలో ఒకే సారి రిలీజ్ కానున్న ఈ చిత్రంలో యువ నటుడు ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తుండగా, ఉన్ని ముకుందన్ కీలక రోల్ పోషించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












