కథ లు చెప్పడం లో నా తరువాతే ఎవరైనా:శృతి హసన్

 కమల్ హసన్ కూతురిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి మంచి క్రేజ్ సంపాదించిన శృతి హసన్ తన టాలెంట్ తో దక్షిణాది సినిమా పరిశ్రమలో అటు హీరోయిన్ గానే కాకుండా సింగర్ గాను, కంపోజర్ గాను మంచి గుర్తిపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ కవితలు కూడా రాయడం మొదలుపెట్టిందట. ఆ విషయాన్ని స్వయంగా శృతి హసన్ వెల్లడించింది. తనకి కవితలు రాయడం తెలుసు కాని కథలు మాత్రం రాయలేనని, కాని చిన్న వయస్సులో ఉన్నపుడు చాలా కథలే చెప్పేదాన్నని స్కూల్ కి లేట్ గా  వెళ్ళినపుడు టీచర్ కి ఒక కథ,ఇంటికి లేట్ గా వెళ్ళినప్పుడు అమ్మకి ఒక కథ, స్నేహితులకు అయితే కల్పించి మరీ కథలు చెప్తూ ఉండేదాన్ని అంటుంది.
అలా చిన్నతనంలో అందరికి కథలు చెప్పి, ఆ కథలతో అప్పుడప్పుడు సమస్యలు కూడా ఎదుర్కున్నానని తెలిపింది. ప్రస్తుతం మాత్రం అటువంటి కథలు చెప్పడం లేదని,భవిష్యత్తులో ఒకవేళ రాస్తే సినిమా కథ రాస్తానని అది ఎప్పుడో ఖచ్చితంగా చెప్పలేనని తెలిపింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ  నాగచైతన్య సరసన ‘మజ్ను’ సినిమాలో హీరోయిన్ గా,మరోపక్క కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతుంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus