ప్రస్తుత కాలంలో నటనపై మక్కువతో వివిధ రంగాలలో పనిచేస్తున్న వారు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులు కూడా సినిమాలలో నటిస్తుండడం మనం చూస్తున్నాము.. కీలకమైన ముఖ్యపాత్రలలో చేయడానికి రాజకీయ నాయకులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఈ వయసులో మొహానికి రంగు వేసి కెమెరా ముందుకు రాబోతున్నారు. అనంతపురానికి చెందిన పల్లె రఘునాథ్ రెడ్డి రాజకీయాలపై మక్కువతో ఈయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా పనిచేశారు.
అయితే ఈయన రాజకీయాలలోకి రాకముందు ఒక గొప్ప విద్యావేత్త. ఈ క్రమంలోని ఈయనకు అనంతపురంలో ఎన్నో విద్యాసంస్థలు కూడా ఉన్నాయి.ఇలా విద్యారంగంలోనూ రాజకీయాలలోనూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పల్లె తనలో మరో యాంగిల్ కూడా ఉందంటూ నటనరంగం వైపు ఆసక్తి చూపుతున్నారు. అనంతపురానికి చెందిన కూరగాయల లక్ష్మీపతి అనే వ్యక్తి ఐక్యూ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం వల్ల పల్లె రఘునాథ్ రెడ్డి కాలేజీలో చిత్రీకరణ జరపడం కోసం ఆయనను సంప్రదించారు.
అయితే ఇందులో ఒక పవర్ ఫుల్ కలెక్టర్ పాత్ర ఉందని అందులో నటించడం కోసం పల్లె రఘునాథ్ రెడ్డిని సంప్రదించగా ఆయన కూడా నటించడానికి ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ద్వారా పల్లె రఘునాథ్ రెడ్డి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈయన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తంపూర్తి అయిందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈయన ఒక చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. చూడు కమిషనర్ నేను టై వేసుకున్నంత వరకే కలెక్టర్ ఒక్కసారి టై తీసాను అంటే టైగర్ అనే డైలాగ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ డైలాగ్ వింటేనే ఈయన పాత్ర ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది.