రామ్ పోతినేని ఈసారి గేర్ మార్చాడు. కేవలం రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్స్ మాత్రమే కాకుండా, ఆడియన్స్ లో భయం పుట్టించడానికి సిద్ధమయ్యాడు. కెరీర్లో ఇప్పటివరకు టచ్ చేయని ఒక కొత్త జోనర్ లోకి అడుగుపెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న బ్యానర్ చూస్తే అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన ‘బాహుబలి’ నిర్మాతలు ఆర్కా మీడియా వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Ram Pothineni
శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని లాంటి బడా నిర్మాతలు రామ్ తో సినిమా చేస్తున్నారంటే, ఆ స్కేల్ కచ్చితంగా భారీగానే ఉంటుంది. క్వాలిటీ విషయంలో వారు ఎక్కడా రాజీ పడరని ఇండస్ట్రీలో మంచి పేరుంది. అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఇది ఒక హార్రర్ థ్రిల్లర్. ఇప్పటివరకు లవర్ బాయ్ గా, మాస్ హీరోగా కనిపించిన రామ్, మొదటిసారి భయపెట్టే కథలో నటించడానికి ఒప్పుకోవడం నిజంగా సాహసమే.
‘ఆంధ్రా కింగ్ తాలూకా’తో ఎమోషనల్ గా కనెక్ట్ అయిన రామ్, వెంటనే ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకోవడం అతని గట్స్ కు నిదర్శనం. ఇంత పెద్ద బ్యానర్, స్టార్ హీరో ఉన్నప్పుడు కచ్చితంగా స్టార్ డైరెక్టర్ ఉంటారని అనుకుంటాం. కానీ ఇక్కడే మేకర్స్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. ‘కిషోర్’ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు.
ఒక కొత్త కుర్రాడు చెప్పిన కథకు ఆర్కా మీడియా, రామ్ ఏకధాటిగా ఓకే చెప్పారంటే.. స్క్రిప్ట్ లో విషయం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కథలో కొత్తదనం ఉంటేనే ఇలాంటి రిస్క్ చేస్తారు. మొత్తానికి రామ్ ఇప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాడు. ఈ కాంబినేషన్ వింటుంటేనే ఆసక్తి కలుగుతోంది. కేవలం భయపెట్టడమే కాకుండా, బలమైన ఎమోషన్ కూడా ఈ కథలో ఉంటుందని టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
