Chiranjeevi: ఏపీలో టికెట్ రేట్లు పెంచడం కరెక్టేనా?

వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు విడుదలైన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ టికెట్ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే భీమ్లా నాయక్ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఏపీ ప్రభుత్వం కొత్త టికెట్ల జీవోను అమలులోకి తెచ్చింది. ఈ జీవో వల్ల రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలకు భారీస్థాయిలో బెనిఫిట్ చేకూరింది. అయితే ఈ సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో ప్రేక్షకుల నుంచి కూడా ఏ మాత్రం వ్యతిరేకత వ్యక్తం కాలేదు.

Click Here To Watch NOW

అయితే రెమ్యునరేషన్లు కాకుండా 100 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఆచార్య సినిమాకు కూడా ఏపీ సర్కార్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. ఏపీలో 20 శాతం షూటింగ్ జరుపుకోవాలన్న నిబంధనను సైతం ఆచార్య పాటించలేదని సమాచారం అందుతోంది. ఏపీ ప్రభుత్వం పది రోజుల పాటు 50 రూపాయల చొప్పున టికెట్ రేట్లు పెంచుకునే విధంగా ఈ సినిమాకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. ఆచార్య సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పెరిగిన టికెట్ రేట్లు కలెక్షన్లపై ఏ మాత్రం ప్రభావం చూపే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు.

ఒకవేళ ఆచార్య మూవీకి నెగిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్లపై తీవ్రంగా ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆచార్య మూవీ థియేట్రికల్ హక్కులను తక్కువ రేట్లకు విక్రయించడంతో ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆచార్య బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.

ఆచార్య కనీసం 140 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పవచ్చు. ఆచార్య ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus