ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి ఇటీవల అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆఫర్ ఇచ్చినట్లే ఇచ్చి ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు ఊహించని షాక్ లు ఇస్తోంది. అసలే 50% ఆక్యుపెన్సీ తో థియేట్రికల్ బిజినెస్ జరగడం అనేది చాలా కష్టమైన పని. ఇక ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్ల రేట్లు కేటాయించాలని రూల్ తీసుకొస్తున్నారు. సినిమా నియంత్రణ చట్టం 1955 ప్రకారం జారీ చేసిన 1273 జీవోను సవరిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
గవర్నమెంట్ ఆదేశాల మేరకు మాత్రమే సినిమా హాళ్లలోని వివిధ కేటగిరీల టికెట్ రేట్లను ఫిక్స్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కరోనా వలన జనాలు తీవ్ర స్థాయిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. అందువలన టికెట్ల రేట్లను అదుపులో ఉంచడమే బెటర్ అని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి మరోసారి షాక్ తగిలనట్లయ్యింది.
ప్రస్తుతం తెలంగాణలో 100% ఆక్యుపెన్సీకి అనుమతులు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఏపీలో ఇలాంటి రూల్స్ రావడంతో సినీ పెద్దలు మరోసారి ఏపీ సీఎంతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!