చిన్న సినిమాల కోసం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ తీసుకోబోతోంది. గతంలో చాలామంది సినీ ప్రముఖులు చిన్న సినిమాలకి సినిమా థియేటర్లు దొరకడం కష్టంగా మారింది అని వాబోయిన విషయం తెలిసిందే. ఇక ఆ విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచించేందుకు నిర్ణయం తీసుకుంది. నేడు మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణమూర్తి వంటి సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కలుసుకున్నారు.
ఇక సమావేశంలో ఆర్.నారాయణమూర్తి ముఖ్యంగా చిన్న సినిమాలకి సంబంధించిన సమస్యల గురించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సగటు సినిమాలకు థియేటర్స్ దొరకడం లేదని ఫెస్టివల్స్ హాలిడేస్ లలో కూడా పెద్ద సినిమాలే వస్తున్నాయని అన్నారు. ఇక ఆ విషయంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రాబోతున్నట్లు సమాచారం. ఇక ఫైనల్ గా సినిమా పరిశ్రమలో చిన్న సినిమాలకి అనువుగ ఉండేలాగా వాటికి ప్రాధాన్యతను ఇస్తూ 5వ షోను కూడా ప్రదర్శించుకునేలాగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఇక భారీ బడ్జెట్ సినిమాలు రాయితీల విషయంలో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నారు. వైజాగ్ కేంద్రంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సహకారం. స్టూడియో నిర్మాణానికి కూడా ప్రోత్సాహకాలు. ఇక ఇటీవల టికెట్ ధరలను తగ్గిస్తూ సవరిస్తూ కొత్త జీవోను విడుదల చేయనున్నారు. మెగాస్టార్ చెప్పిన దాన్ని బట్టి ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడిందని తెలుస్తోంది. తెలంగాణాలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందినట్టుగానే ఆంధ్రాలోనూ అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలూ కన్పిస్తామని సీఎం చెప్పారని ఉభయ రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని మెగాస్టార్ అన్నారు.
ఇక ఈరోజు సహృద్భావంగా ఈ చర్చ ముగిసిందని.. దానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రికి, పేర్ని నానికి, అలాగే న్యాయబద్ధంగా ఫైనల్ డ్రాఫ్ట్ ఇచ్చినందుకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలని అన్నారు. హోప్ ఫుల్లీ ఈ నెల మూడవ వారం లోపల జీవో వచ్చే అవకాశం ఉందని ఎంత తొందరగా జీవో వస్తే అంత తొందరగా సినీ పరిశ్రమ ముందుకు వెళ్తుంది.. అని చిరంజీవి మాట్లాడారు.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!