ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల వ్యవహారంలో థియేటర్ల యజమానులు, పంపిణీదారుల వాదనలు ఎలా ఉన్నా… ప్రభుత్వం మరోవైపు తన పని తాను చేసుకుపోతోంది. సినిమా టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ కోసం ఓ పోర్టల్‌ను రెడీ చేస్తోంది. దాని పేరును కూడా ఇటీవల ప్రకటించారు. యువర్ స్క్రీన్స్ పేరుతో ఓ పోర్టల్‌ను తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) ఎండీ టి.విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ‘యువర్ స్క్రీన్స్’ అనే పోర్టల్ ద్వారా ఇకపై సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తామని స్పష్టం చేశారు.
బ్లాక్ టికెట్ల విధానాన్ని అరికట్టడంతోపాటు తక్కువ ధరకే వినోదం అందించడానికి త్వరలోనే ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని విజయ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ పోర్టల్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధరపై 1.95 శాతం సర్వీస్ ఛార్జి ఉంటుందట. అదే ఇతర ఆన్‌లైన్ పోర్టళ్ల ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ఒక్కో టికెట్‌పై రూ.20 నుంచి రూ.25 వరకు భారం పడుతోందని ఆయన చెప్పారు. APSFTVTDCతో ఒప్పందం చేసుకునే థియేటర్లకు టికెట్ల డబ్బులు ఏ రోజుకు ఆ రోజు బదలాయిస్తామని చెప్పారు.
అలాగే ఇప్పటికే ఆయా థియేటర్ల యాజమాన్యాలు ఇతర ఆన్‌లైన్ పోర్టళ్లతో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దవుతాయనే అపోహలు అక్కర్లేదు అని విజయ్ కుమార్ చెప్పారు. థియేటర్లు ప్రస్తుతం ఒప్పందాల్లో ఉన్న పోర్టళ్లతో పాటు ప్రభుత్వం తీసుకొచ్చే యువర్ స్క్రీన్స్ ద్వారా కూడా ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకోవచ్చట. అయితే దీనిపై థియేటర్లు, పంపిణీదారులు ఏమంటారో చూడాలి.
ఒకవేళ APSFTVTDC చెబుతున్నట్లు తక్కువ రేటుకే యువర్ స్క్రీన్స్‌లో యూజర్లు టికెట్లు బుక్ చేస్తారు. దాని వల్ల మిగిలిన పోర్టల్స్‌కి ఇబ్బంది తప్పక ఎదురవుతుంది. అయితే APSFTVTDC చెబుతున్నట్లు ఏ రోజు డబ్బులు ఆ రోజు థియేటర్ల వాళ్లకు హ్యాపీనే. ఒకవేళ అది జరగకపోతే చాలా ఇబ్బంది వస్తుంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!