తెలుగు చలన చిత్ర పరిశ్రమ చాలా కాలంగా ఎదురుచూస్తున్న జీవో వచ్చేసింది. సినిమా టికెట్ ధరలను సవరిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది. ఈ మేరకు మినిమమ్ టికెట్ రేట్ 20 రూపాయలుగా, మ్యాగ్జిమమ్ టికెట్ ప్రైస్ 250 రూపాయలుగా నిర్ణయిచింది. థియేటర్ ఉన్న ప్రాంతాన్ని బట్టి థియేటర్లను నాలుగు రకాలుగా విభజించి కొత్త ధరలను నిర్ణయించింది. ఈ రేట్లకు జీఎస్టీ అదనం, అలాగే మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా వసూలు చేస్తారు.
హీరో, డైరెక్టర్ పారితోషికం కాకుండా ₹100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటును కూడా ఏపీ ప్రభుత్వం కల్పించింది. ఇలా కనీసం 10 రోజులపాటు టికెట్ రేట్లు పెంచుకునే ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ ఓ మెలిక పెట్టింది. సినిమా షూటింగ్‌లో 20 శాతం ఆంధ్రలో చేసిన సినిమాలకు మాత్రమే ఈ రేట్లు పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. దీంతోపాటు చిన్న సినిమాలకు ఐదు షోలు వేసుకునే అవకాశం కల్పించారు. అలాగే టికెట్ రేట్లపై గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 35ను రద్దు చేసినట్లు కూడా ప్రకటించారు.
కొత్త ధరల వివరాలు…
* మున్సిపల్ కార్పొరేషన్లలో నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ. 40, ప్రీమియం టికెట్ ధర 60. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం రూ. 70, ప్రీమియం రూ. 100. స్పెషల్ థియేటర్స్‌లో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ. 100, ప్రీమియం టికెట్ ధర రూ. 125. మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ సీట్లకు రూ. 150. రెక్లయినర్ సీట్లకు రూ. 250.
* మున్సిపాలిటిలో నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ. 30, ప్రీమియం టికెట్ ధర రూ. 50. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం రూ. 60, ప్రీమియం రూ. 80. స్పెషల్ థియేటర్స్‌లో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ. 80, ప్రీమియం టికెట్ ధర రూ. 100. మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ సీట్లకు రూ. 125. రెక్లయినర్ సీట్లకు రూ. 250.
* నగర పంచాయతి, గ్రామ పంచాయతీలో నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ. 20, ప్రీమియం టికెట్ ధర రూ. 40. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం రూ. 50, ప్రీమియం రూ. 70. స్పెషల్ థియేటర్స్‌లో నాన్ ప్రీమియం టికెట్ ధర రూ. 70, ప్రీమియం టికెట్ ధర రూ. 90. మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ సీట్లకు రూ. 100. రెక్లయినర్ సీట్లకు రూ. 250.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!