Bheemla Nayak: ఏపీలోని మల్టీప్లెక్స్ వింత రూల్ వైరల్!

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా గురించి జోరుగా చర్చ జరుగుతోంది. పవన్ అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ఈ సినిమా అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటంతో పవన్ అభిమానులు సైతం సంతోషిస్తున్నారు. గతేడాది వకీల్ సాబ్ తో సక్సెస్ సాధించిన పవన్ ఈ ఏడాది భీమ్లా నాయక్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.

Click Here To Watch

ఏపీలో భీమ్లా నాయక్ టికెట్లను ఎక్కువ రేట్లకు అమ్మకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే కొన్ని థియేటర్ల యాజమాన్యాలు మాత్రం నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. కౌంటర్ల దగ్గర ప్రభుత్వం చెప్పిన టికెట్ రేట్లు ఉన్నా పలు ప్రాంతాల్లో ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతుంటే మరి కొన్నిచోట్ల బ్లాక్ లో టికెట్లను విక్రయిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని ఒక మల్టీప్లెక్స్ మాత్రం భీమ్లా నాయక్ టికెట్ కావాలంటే స్నాక్స్ టోకెన్ తీసుకోవాల్సిందేనని నిబంధన పెట్టినట్టు సమాచారం అందుతోంది.

ఆ మల్టీప్లెక్స్ లో భీమ్లా నాయక్ టికెట్ ధర 250 రూపాయలు కాగా స్నాక్స్ టోకెన్ ధర 120 రూపాయలుగా ఉంది. స్నాక్స్ కు ముందుగా బిల్లును ఫిక్స్ చేసి టికెట్ రేట్లను అమ్ముతుండటం గురించి చర్చ జరుగుతోంది. ఏపీలో వైసీపీ నేతల థియేటర్లలో కూడా ఎక్కువ టికెట్ రేట్లు అమలులో ఉన్నాయని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డలోని అధికార పార్టీ నేత థియేటర్ లో ఎలాంటి రూల్స్ పాటించకుండా ఒక్కో టికెట్ ను 300 రూపాయల చొప్పున అమ్ముతున్నారు.

ఎక్కువ రేట్లకు అమ్మడం వల్ల థియేటర్ల ఓనర్లు లాభపడుతున్నా ఆ మొత్తం డిస్ట్రిబ్యూటర్లకు చేరుతుందా అనే ప్రశ్నకు మాత్రం చేరదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. భీమ్లా నాయక్ తొలిరోజు కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాల్సి ఉంది.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus