ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ కీలకనిర్ణయం తీసుకుంది. యాభై శాతం సిట్టింగ్ కెపాసిటీతో థియేటర్లు తెరుచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. జూలై 8నుండి ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటికే థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. వంద శాతం అక్యుపెన్సీకి కూడా ఓకే చెప్పింది. కానీ ఏపీలో మాత్రం యాభై శాతమే. ఏప్రిల్ ద్వితీయార్ధం నుండి ఏపీ, తెలంగాణలలో థియేటర్లు మూతపడ్డాయి. అప్పటినుండి కొత్త సినిమాలు విడుదలకు నోచుకోలేకపోయాయి.
చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఇప్పుడు ఏపీ, తెలంగాణలలో థియేటర్లు తీర్చుకోవడానికి అనుమతులు వచ్చాయి కాబట్టి చిన్న సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఏపీలో గనుక వంద శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ వస్తే పెద్ద సినిమాలు కూడా విడుదలవుతాయి. ‘వకీల్ సాబ్’ సినిమా సమయంలో అయితే ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గించింది. ఇప్పుడు కూడా అవే రేట్లు గనుక కొనసాగితే.. యాభై శాతం ఆక్యుపెన్సీతో భారీ కలెక్షన్స్ రాబట్టడం కష్టమే. కాబట్టి టికెట్ రేట్లపై కూడా ఓ నిర్ణయం ప్రకటించే వరకు పెద్ద సినిమాలు రావేమో. మరేం జరుగుతుందో చూడాలి!
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!