Hero Nani: ఏపీలో ఏకంగా 70 థియేటర్లు మూసేశారా?

  • December 24, 2021 / 07:00 AM IST

హీరో నాని కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమాకు ఏపీ థియేటర్ల ఓనర్లు భారీ షాకిచ్చారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో టికెట్ రేట్లను ఊహించని స్థాయిలో తగ్గించిన సంగతి తెలిసిందే. ఆ టికెట్ రేట్ల వల్ల రాష్ట్రంలో థియేటర్లు నడిపే పరిస్థితి లేదు. మరోవైపు ఏపీ ప్రభుత్వం సూచనల మేరకు అధికారులు నిబంధనలను పాటించని థియేటర్లను సీజ్ చేస్తున్నారు. థియేటర్లలో కొనసాగుతున్న సోదాలు థియేటర్ల ఓనర్లను టెన్షన్ పెడుతున్నాయి.

థియేటర్లలో తినుబండారాలు అధిక ధరలను విక్రయిస్తున్నా అధికారులు ఫైన్స్ వేస్తుండటం గమనార్హం. కృష్ణా జిల్లాలో అధికారులు 12కు పైగా థియేటర్లను మూసివేశారని కథనాలు రాగా గోదావరి జిల్లాలలో థియేటర్ల యజమానులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోనే ఏకంగా 50కు పైగా థియేటర్లను మూసివేశారని వార్తలు వస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని పలు థియేటర్లలో కూడా అధికారులు తనిఖీలు చేశారని బోగట్టా. ఏపీలో దాదాపుగా 70 థియేటర్లు మూసేవేశారని వార్తలు వస్తుండగా

శ్యామ్ సింగరాయ్ సినిమాపై ఈ ప్రభావం పడే ఛాన్స్ ఉంది. శ్యామ్ సింగరాయ్ సినిమాకు తూర్పు గోదావరి జిల్లాలో పది థియేటర్లు కూడా దొరకలేదని ప్రచారం జరుగుతోంది. ఏపీలోని చాలా ఏరియాలలో శ్యామ్ సింగరాయ్ సినిమా రికవరబుల్ అడ్వాన్స్ ల కింద రిలీజ్ కానుందని బోగట్టా. నాని చేసిన వ్యాఖ్యలు సైతం ఏపీ ప్రభుత్వ ఎమ్మెల్యేలకు కోపం తెప్పించాయి. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు రిలీజయ్యే సమయానికి ఏపీలో థియేటర్ల విషయంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయో లేదో చూడాల్సి ఉంది.

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ఏపీ థియేటర్ల ఓనర్లు భారీ మొత్తంలో నష్టపోయారు. ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే ఇండస్ఱ్రీకి ప్రయోజనం చేకూరుతుంది. హీరో నాని కామెంట్లు శ్యామ్ సింగరాయ్ పై ప్రభావం చూపుతాయేమో చూడాల్సి ఉంది. శ్యామ్ సింగరాయ్ కు థియేటర్ల కష్టాలు తప్పేలా లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus