Aparna: హీరోయిన్ అపర్ణ బాలమురళితో అసభ్యంగా ప్రవర్తించిన స్టూడెంట్!

మలయాళ హీరోయిన్ అపర్ణ బాలమురళి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. సూర్య హీరోగా తెరకెక్కిన ‘ఆకాశమే నీ హద్దురా’ మూవీతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వడంతో ఎక్కువ మందే ఈ చిత్రాన్ని వీక్షించారు. సినిమా కూడా ప్రేక్షకుల నుండి మంచి టాక్ ను రాబట్టుకుంది.ఈ సినిమాలో సూర్య భార్యగా ఓ బేకరీ నడుపుకునే గృహిణిగా ఈమె చక్కగా నటించింది. ఆ తర్వాత ఈమె తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తుంది అని అంతా అనుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో రూపొందే మూవీలో ఈమె నటిస్తోంది అంటూ టాక్ నడిచింది. కానీ దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈమె నటిస్తున్న ‘తాంకం’ సినిమా ప్రమోషన్లో భాగంగా మూవీ చిత్ర బృందం ఓ కాలేజీలో ఈవెంట్ ను నిర్వహించింది. ఇందులో ఓ స్టూడెంట్ అత్యుత్సాహంతో అపర్ణ బాలమురళి భుజంపై చేయివేయడానికి ప్రయత్నించాడు.

మొదట ఆమెకు ఓ ఫ్లవర్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ స్టూడెంట్ ఆ తర్వాత ఆమె భుజంపై చేయి వేశాడు. దీంతో అపర్ణ బాలమురళి ఇబ్బంది పడింది. అదే సమయంలో ఆ స్టూడెంట్ నుండి పక్కకు తప్పుకోవడానికి ట్రై చేసింది.ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాలేజీ మేనేజ్మెంట్ లేదా చిత్ర బృందం ఆ స్టూడెంట్ ను కంట్రోల్ చేయకపోవడం పై నెటిజన్లు మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus