నెక్స్ట్ సమ్మర్ సినిమాల‌ పరిస్థితేంటి?

2025కి సంబంధించిన తొలి మూడు నెలలు టాలీవుడ్‌లో ఊహించని ట్విస్ట్‌లతో గడిచిపోయాయి. కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోగా, చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌కి ఊపిరిగా మారాయి. ఇప్పుడు నాల్గో నెలగా అడుగుపెడుతున్న ఏప్రిల్‌లో పరిస్థితి ఎలా ఉండబోతుందన్న దానిపై ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా చూస్తోంది. ప్రధానంగా పెద్ద సినిమాల బజ్ కొంత తక్కువగానే కనిపిస్తోంది. మొత్తంగా ఏప్రిల్‌లో (April) దాదాపు 20కి పైగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో మెయిన్ హైలైట్‌గా కనిపిస్తున్నవి మూడు సినిమాలే.

April

టాలీవుడ్ నుండి సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటించిన జాక్ (Jack), కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar)  గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly), బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) నటించిన జాట్ (Jaat)  చిత్రాలు. విశేషం ఏంటంటే, ఈ మూడు సినిమాలూ ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతున్నాయి. ఈ చిత్రాలు మూడు వేర్వేరు జనర్లలో తెరకెక్కుతున్నా, బజ్ మాత్రం అంతగా కనిపించడం లేదు. జాక్ కామెడీ, యూత్ ఎంటర్టైనర్ అయితే, గుడ్ బ్యాడ్ అగ్లీ కమర్షియల్ యాక్షన్ డ్రామా.

జాట్ మాత్రం నార్త్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ తీసిన మాస్ యాక్షన్ ఫిల్మ్. అయినప్పటికీ, సోషల్ మీడియాలో ప్రమోషన్లు, ట్రెండింగ్ విషయాల్లో ఇవేవీ టాప్‌లో కనిపించడంలేదు. ఇది థియేట్రికల్ ఓపెనింగ్స్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్ 17న తమన్నా భాటియా (Tamannaah Bhatia) నటించిన ఓదెల 2 రానుండగా, 18న ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రలో సారంగపాణి జాతకం (Sarangapani Jathakam) విడుదల కానుంది. ఇవే కాకుండా మరో పది వరకు చిన్న సినిమాలు వరుసగా వస్తున్నాయి. కానీ వీటిలో బలమైన కంటెంట్ ఉన్నవే నిలదొక్కుకోవాలి.

ఈసారి ఏప్రిల్‌లో పెద్ద సినిమాల హడావిడి తక్కువగా ఉండటం, మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చు. సమ్మర్ అంటేనే పెద్ద సినిమాల సీజన్ అని టాలీవుడ్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాల దృష్టిలో చూస్తే, మౌత్ టాక్‌కే కీలకం కానుంది. టీజర్, ట్రైలర్ స్థాయిలో ఆకట్టుకున్నా, థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ప్రేక్షకుడి తీర్పును మలచనుంది. మరి ఈ నెల ఎవరు గెలుస్తారు, ఎవరు తప్పుకుంటారు అనేది మౌత్ టాక్ మీదే ఆధారపడి ఉంటుంది.

విజయ్, పవన్ కల్యాణ్ లతో కమలం మల్టీస్టారర్ వ్యూహం!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus