ఎన్టీఆర్-పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అరవింద సమేత వీరరాఘవ”. అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు నిన్న సాయంత్రం పూర్తయ్యాయి. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు “సినిమా అదిరింది, త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ అనడమే కాక” ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికేట్ కూడా అందించారు. సినిమాకి సెకండాఫ్ మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని, ముఖ్యంగా.. సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ రోమాలు నిక్కబొడుచుకునే ఉంటాయట. తండ్రిని చంపినవారి మీద పగ తీర్చుకునే కొడుకు వీరరాఘవుడిగా ఎన్టీయార్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు.
అయితే.. విలన్ జగపతిబాబును మాత్రం ఎన్టీఆర్ చంపడట. అదే సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. “జల్సా” చిత్రంలోని శత్రువు చంపడం కాదు.. గెలవటం ముఖ్యం అనే ఫార్ములానే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఫాలో అవుతాడట. అలాగే.. మదర్ సెంటిమెంట్ మరియు ఫాదర్ సెంటిమెంట్ సీన్స్ సినిమాకి ప్రధానమైన ఆకట్టుకొనే అంశాలుగా నిలుస్తాయని టాక్. సో, ఇప్పటివరకూ వచ్చిన టాక్ & తెలిసిన ఇన్ఫో ప్రకారం “అరవింద సమేత” చిత్రం కేవలం ఎన్టీఆర్ అభిమానులను మాత్రమే కాక యావత్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాక ఎన్టీయార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.
ముఖ్యంగా.. గురువారం విడుదలవుతుండడంతో లాంగ్ వీకెండ్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ కానుంది. అన్నిటికంటే ముఖ్యంగా “అజ్ణాతవాసి” సినిమా తర్వాత అజ్ణాతవాసం చేసిన గురుజీ అభిమానులందరూ వెలుగులోకి రావడమే కాక కాలర్ ఎగరేయడం ఖాయమని విశ్లేషణలు వెల్లడవుతున్నాయి. మరి అంచనాలను ఇంత భారీగా పెంచేసిన “అరవింద సమేత వీరరాఘవ” సినిమాగా ఎంతవరకూ ఆకట్టుకుంటుంది, అలరిస్తుంది అనేది ఇంకో 48 గంటల్లో తెలిసిపోనుంది.