సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న “అరవింద సమేత” టీజర్!

ఎన్టీఆర్ సినిమాకే ఎందుకు ఇలా జరుగుతోంది ?.. గతంలో అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఎక్కువ మందికి వచ్చిన ప్రశ్న ఇది. అప్పుడే త్రివిక్రమ్ తన బృందానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఫోటో లీకులు ఆగాయి. కానీ ఇప్పుడు ఏకంగా టీజర్ బయటికి వచ్చేసింది. హారిక, హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ని ఆగస్టు 15 న రిలీజ్ చేస్తామని నిన్ననే ప్రకటించారు. ఎన్టీఆర్ అభిమానులు పండుగకు సిద్ధమయ్యారు. ఇంకా ఐదు రోజుల సమయం ఉండగానే “అరవింద సమేత” టీజర్ లీక్ అయింది. ఈ టీజర్ లో ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. రాయలసీమ నేపథ్యంలో సాగె ఈ కథలో ఎన్టీఆర్ కి తండ్రిగా మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. తీవ్రగాయాలతో ఉన్న నాగబాబును కారులో తీసుకెళ్తున్న సన్నివేశం టీజర్లో హైలెట్ గా నిలిచింది.

కారులో తారక్ అనుచరులు కూడా కనిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన వారు మాత్రం సినిమా చూడాలనే ఆత్రుత మరింత పెరిగిందని చెబుతున్నారు. అభిమానులు ఆనందంగా  ఉన్నప్పటికీ చిత్ర బృందం మాత్రం తలపట్టుకుంది. కస్టపడి కట్ చేసిన టీజర్ లీక్ అయింది కాబట్టి వేరే టీజర్ కట్ చేయాలా? లేదా సమయం లేదు కాబట్టి దానినే రిలీజ్ చేయాలా? అనే ఆలోచనలో పడింది. ఈ వీడియోకి ఎస్ ఎస్ థమన్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని ఇచ్చారు. కొత్త టీజర్ కట్ చేస్తే అందుకు మ్యూజిక్ ఇవ్వడం కూడా ఆలస్యం అవుతుంది. డీఐ దశలోనే లీక్ జరిగిందని ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ఇకనుంచి లెలీకులు జరగ కుండా ఉండాలని మరింత కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus