‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) వంటి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘అరవింద సమేత’ (Aravinda Sametha Veera Raghava) . ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై రాధాకృష్ణ(చినబాబు) (S. Radha Krishna) ఈ చిత్రాన్ని నిర్మించారు. 2018 అక్టోబర్ 11న ఈ చిత్రం విడుదలైంది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో ఆ టైంకి హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు కొట్టింది.
నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 6 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో.. తెలుసుకుందాం రండి :
నైజాం | 21.00 cr |
సీడెడ్ | 16.50 cr |
ఉత్తరాంధ్ర | 8.70 cr |
ఈస్ట్ | 5.50 cr |
వెస్ట్ | 4.60 cr |
గుంటూరు | 7.90 cr |
కృష్ణా | 4.90 cr |
నెల్లూరు | 2.50 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 71.60 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 8.70 cr |
ఓవర్సీస్ | 13.20 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 93.50 cr |
‘అరవింద సమేత’ (Aravinda Sametha Veera Raghava) చిత్రానికి రూ.92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.93.5 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.1.5 కోట్ల ప్రాఫిట్స్ తో లాభాలు అందించి క్లీన్ హిట్ గా నిలిచింది.