జై లవకుశ మొదలయినప్పటి నుంచి అభిమానులను ఊరిస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తారక్ త్రి పాత్రాభినయం చేస్తుండడం, అందులోను నెగటివ్ షేడ్స్ కలిగిన రోల్ చేస్తుండడంతో దీనిపై విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. ఇప్పటికే విడుదలయిన టీజర్లు, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. డిస్ట్రిబ్యూటర్లు సినిమా థియేటర్ రైట్స్ ని భారీ ధర చెల్లించి దక్కించు కున్నారు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్ రైట్స్ 83.5 కోట్లకు అమ్ముడు పోయింది. ఆడియో రైట్స్ ని లహరి మ్యూజిక్ వాళ్ళు 1 .4 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. తెలుగు శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ వారు 13 కోట్లకు, హిందీ శాటిలైట్ రైట్స్ ని జీ నెట్ వర్క్ వారు 11 కోట్లకు దక్కించుకున్నారు. ఇంత మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో, ఈ మూవీ రిలీజ్ తర్వాత అనేక రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అనేక అంచనాలు నెలకొని ఉన్న జై లవకుశ సెప్టెంబర్ 21 న థియేటర్లోకి రానుంది.
థియేటర్ రైట్స్ ఏరియాల వారీగా కోట్లల్లో ..
నైజాం – 18
సీడెడ్ – 12 .60
ఉత్తరాంధ్ర – 8
పశ్చిమగోదావరి – 5 .04తూర్పు గోదావరి – 5 .76
కృష్ణ, గుంటూరు – 12 .6
నెల్లూరు – 3
తమిళనాడు – 1
కర్ణాటక – 8.20ఇతర రాష్ట్రాల్లో – 0 .80
ఓవర్ సీస్ – 8. 50
టోటల్ – 83.5
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.