బిగ్ బాస్ 4: ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఇదేనా..?

బిగ్ బాస్ హౌస్ లో ప్రతివారం నామినేషన్స్ అనేది జరగడం చాలా సర్వసాధారణం. ఈ ప్రక్రియని చేస్తేనే గేమ్ లో ముందుకు వెళ్లేది. ఇందులో భాగంగా 10వ వారం 11వ వారం నామినేషన్స్ బాగా హీటెక్కాయనే చెప్పాలి. 10వ వారం మెహబూబ్, 11వ వారం లాస్య ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మరి 12వ వారం ఎవరు హౌస్ నుంచి వెళ్లిపోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

నామినేషన్స్ లో నలుగురు ఉన్నారు. అందులో అరియానా, అవినాష్ , మోనాల్, ఇంకా అఖిల్ లు ఉన్నారు. నిజానికి అమ్మరాజశేఖర్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యేటపుడు బిగ్ బాస్ హౌస్ లో ఛాలెంజ్ ని పెట్టారు. ఫస్ట్ టైమ్ నామినేషన్స్ లో ఉన్నవారికి ఒక టాస్క్ ఇచ్చి తమని తాము కాపాడుకోవచ్చని చెప్పారు. కానీ ఆ టాస్క్ రద్దు అయ్యింది. ఇప్పుడు కూడా నామనేషన్స్ లో ఉన్నవారికి మరో అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో అవినాష్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ సంపాదించిన సంగతి తెలిసిందే.

అయితే, ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం చూస్తే మోనాల్ – అఖిల్ సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక మిగిలింది అవినాష్ అరియానాలు ఇద్దరు మాత్రమే. వీరిలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే, అవినాష్ ఈసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడితే అరియానా ఎలిమినేట్ అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నిజానికి అరియానా గేమ్ పరంగా చూస్తే ఇప్పటివరకూ చాలా స్ట్రయిట్ ఫార్వర్డ్ గా ఆడింది. అంతేకాదు,

టాప్ – 5 లిస్ట్ లోకి వెళ్తుందనే అనుకున్నారు అందరూ. అయితే, ఇప్పుడు అవినాష్ ఎలిమినేట్ అవ్వకుండా ఫ్రీ పాస్ వాడితే అరియానా వెళ్లిపోతుందా.. ? బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఇదేనా అనేది ఆసక్తికరం. ఒకవేళ ఈవారం ఎలిమినేషన్ తీసేస్తే మాత్రం అరియానా బ్రతికిపోయినట్లే లెక్క. మరి ఈసారి వీకండ్ లో బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడు అనేది చూడాలి. అదీ మేటర్.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus