బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం వాడి- వేడి నామినేషన్స్ జరిగాయి. హౌస్ మేట్స్ తలపై సీసా పగలగొట్టి మరీ నామినేట్ చేశారు. ఇందులో భాగంగా ఈసారి అర్జున్ పల్లవి ప్రశాంత్ ని లాజిక్స్ తో మడతెట్టేశాడు. నువ్వు ఆట పరంగా చాలా బాగా ఆడుతున్నావని, నీలో రెండు మైనస్ పాయింట్స్ ఉన్నాయి అవి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది మార్చుకోమని పాజిటివ్ గా చెప్తున్నానంటూ స్టార్ట్ చేశాడు.
గేమ్ లో ఓడిపోయినా లేదా వేరే ఏదైనా అయినా ఓవర్ గా రియాక్ట్ అవుతావ్, ఏడుస్తావ్ బహుశా అది నీ స్వభావం అయి ఉండచ్చు కానీ అది కరెక్ట్ కాదని చెప్పాడు. అలాగే, నామినేషన్స్ అప్పుడు రివేంజ్ నామినేషన్స్ వేస్తావ్. నీ పాయింట్ పైన వేస్కుంటావ్., శివాజీ అన్నని ఎవరైనా ఏదైనా అన్నా కూడా వేస్తావ్ అని చెప్పాడు అర్జున్. అంతేకాదు, దీనివల్ల నీ ఇండివెడ్యువాలిటీ పోతోందని మాట్లాడాడు. దీనికి పల్లవి ప్రశాంత్ కవర్ చేసుకోబోయాడు. అర్జున్ మాత్రం అటు ఇటు తిరుగుతూ పల్లవి ప్రశాంత్ కి ఏదైతే చెప్పాలో అది చెప్పేశాడు.
అంతేకాదు, పల్లవి లాగానే మాట్లాడుతూ ఇమిటేట్ చేస్తూ పుష్ప లాగా మేనరిజమ్స్ ఇస్తూ రెచ్చిపోయాడు. అలాగే భరాబర్ అంటే నా డైలాగ్స్ నువ్వు వాడకు అన్నాడు ప్రశాంత్ దీనికి బరాబర్ మాట్లాడతా అంటూ రెచ్చిపోయాడు. ఇక్కడ పల్లవి ప్రశాంత్ ప్రతి విషయంలో కౌంటర్ టు కౌంటర్ వేయడానికి ప్రయత్నించాడు. ప్రతి మాటకి కౌంటర్ ఎటాక్ చేయబోయాడు. కానీ ఈసారి అది బెడిసికొట్టింది. దీంతో ఏం చేయలేక తన వాదన కరెక్ట్ అని వాదించుకున్నాడు. ఇక్కడే పల్లవి ప్రశాంత్ తిరిగి అర్జున్ ని నామినేట్ చేస్తూ క్లారిటీ ఇవ్వబోయాడు.
దీనినే రివేంజ్ నామినేషన్స్ అంటారు పల్లవి ప్రశాంత్ అంటూ రెచ్చిపోయాడు అర్జున్. దీంతో శివాజీ కూడా షాక్ అయ్యాడు. ఆ తర్వాత శివాజీ ఏం చేశాడంటే., పల్లవి ప్రశాంత్ నామినేషన్ అయ్యాక శివాజీ ప్రశాంత్ కి నచ్చజెప్పాడు. అర్జున్ పై కోపం తెచ్చుకోకు, అర్జున్ చెప్పిన పాయింట్స్ ఆలోచించు. అంతేకానీ, నువ్వు ఆవేశపడకు అంటూ పల్లవి ప్రశాంత్ కి చెప్పాడు. అంతేకాదు, వెళ్లి అర్జున్ తో మాట్లాడు అది మాములుగా కూడా చెప్పచ్చు కదా, నామినేషన్ వేసి చెప్పాలా అంటూ మాట్లాడు అన్నాడు.
ఇక్కడ అర్జున్ చాలా తెలివిగా మాట్లాడాడు. నేను ఏదైనా సరే ఇలాగే చెప్తాను అందరికీ అంతే అంటూ ప్రశాంత్ కి చెప్పాడు. ఫైనల్ గా శివాజీ నామినేషన్స్ జరిగినపుడు శివాజీ ప్రియాంకని నామినేట్ చేస్తూ మెచ్యూరిటీ నీలో ఉందని అనుకున్నానని, రాజమాతగా డెసీషన్ తీస్కోవడంలో విఫలం అయ్యావని చెప్పాడు. అంతేకాదు, అర్జున్ చెప్పేవరకూ కూడా పల్లవి ప్రశాంత్ కి ఈవిషయం చెప్పాలని నాకు అనిపించలేదని అన్నాడు. అంతే మెచ్యూర్ గా ఆలోచించాలి అని శివాజీ మాట్లాడాడు. దీంతో శివాజీ కూడ ఈ నామినేషన్ పాయింట్ ఒప్పుకున్నట్లుగా అయ్యింది.
కానీ, మరోవైపు పల్లవి ప్రశాంత్ కూడా అర్జున్ చెప్పిన నామినేషన్స్ ని ఒప్పుకోలేదు. తిరిగి మళ్లీ అర్జున్ ని నామినేట్ చేస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఓవర్ ఆల్ గా 11వ వారం నామినేషన్స్ లోకి మొత్తం 8మంది వచ్చారు. ఇందులో పల్లవి ప్రశాంత్ కి ఒకే ఒక్క ఓటు వచ్చింది కాబట్టి, నామినేషన్స్ లో లేడు.. అలాగే శివాజీ కూడా ఈవారం కెప్టెన్ కాబట్టి నామినేషన్స్ నుంచీ తప్పించుకున్నాడు. (Bigg Boss 7 Telugu) హౌస్ లో మిగిలిన 8మంది నామినేషన్స్ లో ఉన్నారు. మొత్తానికి అదీ మేటర్.