సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా నిన్న రిలీజ్ అయి అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది. పెళ్లిచూపులు సినిమాలో లేజీ బాయ్ గా నటించి విజయం అందుకున్న విజయ్ దేవరకొండ ఇందులో యాక్షన్ హీరోగా అదరగొట్టారు. మొదటి నుంచి పూర్తి విశ్వాసంతో ఉన్న విజయ్ కి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లో ప్రణయ్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.78 కోట్ల షేర్ రాబట్టి ఆశ్చర్యం కలిగించింది. దీనికి అమెరికాలోను ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ప్రీమియర్ షోతో కలుపుకొని ఒక్క రోజులోనే 1 .24 కోట్ల షేర్ రాబట్టింది.
ఏరియాల వారీగా కలక్షన్స్ కోట్లలో …
నైజాం : 1.4
సీడెడ్ : 0.35
ఉత్తరాంధ్ర : 0.21
ఈస్ట్ గోదావరి : 0.19
వెస్ట్ గోదావరి : 0.10
కృష్ణ : 0.25
గుంటూరు : 0.21
నెల్లూరు : 0.06
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం : 2 .77
అమెరికా : 1 .24
మొత్తం : 4 . 5
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
