Arjun Sarja: కొత్త సినిమా అనౌన్స్‌ చేసిన అర్జున్‌ సర్జా.. హీరో ఎవరబ్బా?

సీనియర్‌ నటుడు అర్జున్‌ సర్జా  (Arjun Sarja)  దర్శకుడిగా.. విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)  హీరోగా, తనయ ఐశ్వర్య అర్జున్‌ (Aishwarya) కథానాయికగా భారీ హైప్‌తో ఓ సినిమా మొదలైంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)  గెస్ట్‌గా వచ్చి మరీ ఆ సినిమా ఓపెన్‌ చేశారు. అయితే ఏమైందో ఏమో కొన్ని రోజుల తర్వాత సినిమా ఆగిపోయింది. మామూలుగా ఆగిపోతే ఒకలా ఉండేది.. సినిమా షూటింగ్‌ సమయంలో వచ్చిన క్రియేటివ్‌ అండ్‌ సమ్‌ డిఫరెన్స్‌ల కారణంగా సినిమా ఆగిపోయింది.

Arjun Sarja

ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అర్జున్‌ సర్జా కొత్త సినిమాను అనౌన్స్‌ చేశారు. ‘సీతా పయనం’ పేరుతో అనౌన్స్‌ చేసిన ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు ఏవీ బయటకు రాలేదు. సినిమా పేరు చూశాక ఇది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమానే అని చెబుతున్నారు. ఆ లెక్కన గతంలో మొదలుపెట్టిన సినిమానే ఇదేమో అని అంటున్నారు. దీంతో ఆ పాత సినిమా ఏంటి? ఆ కథేంటి అనే చర్చ మొదలైంది.

ఇదంతా కొన్ని నెలల కిందటి సంగతి. విశ్వక్ సేన్ హీరోగా అర్జున్‌ సర్జా మొదలుపెట్టిన సినిమా నుండి విశ్వక్‌సేన్‌ తప్పుకున్నాడు. ఆ విషయాన్ని అర్జున్‌కు చేరవేయడంలో ఇబ్బంది కలిగిందో, అసలు చెప్పడమే ఇబ్బంది పెట్టిందో కానీ.. అర్జున్‌ మీడియా ముందుకు వచ్చి జరిగిందంతా చెప్పుకొచ్చారు. అయితే జరిగింది వేరు అంటూ విశ్వక్‌ మరికొన్ని వివరాలు చెప్పాడు. దీంతో అంతా రచ్చ రచ్చ అయింది. ఆ తర్వాత ఆ సినిమాలోకి మరొక యంగ్‌ హీరోను తీసుకుంటున్నారు అని వార్తలొచ్చాయి.

కానీ అదేదీ జరగలేదు. ఐశ్వర్య పెళ్లి చేసుకొని సినిమాల నుండి తాత్కాలికంగా పక్కకు వెళ్లింది. మరోవైపు విశ్వక్ తన సినిమాలతో బిజీ అయిపోయాడు. ఇప్పుడు ‘సీతా పయనం’ సినిమా అనౌన్స్‌ చేశాడు. తనే డైరక్ట్ చేస్తూ, నిర్మించబోతున్నాడు. త్వరలోనే నటీనటుల వివరాలతో ప్రెస్ మీట్ పెడతాడట. అప్పుడు సినిమా గురించి.. ఇప్పటి రూమర్ల గురించి క్లారిటీ వస్తుంది.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus