నా జీవితంలో నేను విశ్వక్ సేన్ కి చేసినన్ని ఫోన్లు ఇంక ఎవ్వరికీ చేయలేదు: అర్జున్ సార్జా

  • November 5, 2022 / 06:42 PM IST

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ వచ్చి క్లాప్ కొట్టాడు. ఈ చిత్రం ద్వారా అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టు నుండి విశ్వక్ సేన్ తప్పుకున్నాడు అంటూ కథనాలు మొదలయ్యాయి. వీటి పై ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చాడు అర్జున్.

అర్జున్ మాట్లాడుతూ.. ” నా 42 ఏళ్ల సినీ కెరీర్లో ఎవరి గురించి ప్రెస్ మీట్ పెట్టి ఇలా చెప్పింది లేదు.కానీ విశ్వక్ సేన్ చేసిన పనికి బాధ కలిగి నా అభిప్రాయాలను పంచుకోవాలని ఇలా మీడియా ముందుకు వచ్చాను. ఉదయం నుండి న్యూస్ లు చాలా వస్తున్నాయి. కానీ నా వైపు నుండి తప్పు ఉందా లేదా అనేది అందరికీ తెలియాలి. అందుకోసమే ఈ మీటింగ్.తెలుగులో నా కూతురిని పరిచయం చేస్తూ నా దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకున్నాను. మీ అందరికీ తెలిసిందే. విశ్వక్ సేన్ హీరో. అతనికి ఈ కథ కూడా బాగా నచ్చింది. పారితోషికం విషయంలో కూడా అతనితో డిస్కషన్ చేశాకే ఫైనల్ చేశాం.

ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా జరిగింది. కానీ షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో విశ్వక్ సేన్ డిలే చేస్తూ వస్తున్నాడు. షూటింగ్లో భాగంగా సెట్ ను డిజైన్ చేశాం. ఉదయాన్నే ఆరు గంటలకు షూటింగ్ స్పాట్ కు రావాలని అందరికీ ముందే చెప్పా. కానీ నాకు ఉదయం 5 గంటలకు విశ్వక్ సేన్ నుండి మెసేజ్ వచ్చింది. ‘సర్ ఐయామ్ సారీ. ప్లీజ్ క్యాన్సిల్ షూట్ అని చూసే సరికి, ఏం జరుగుతుందో నాకు అర్ధం కాలేదు. ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. కథ, క్యారెక్టర్, డైలాగ్ లో ఎలాంటి మార్పూ చేయలేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడనిపించింది. నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను.

మరీ ఇంత అఫెషనలిజమా. నిజంగా ఇది టెక్నీషియన్స్ ను అవమానించడమే. ఆ తర్వాత ఆయన మేనేజర్ ‘సర్ మీతో తర్వాత మాట్లాడతా’ అని మెసేజ్ పెట్టాడు. ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ అంటే అతనికి మర్యాద లేదా? ఈ హీరోను పెట్టుకుని పెద్ద సినిమా చేద్దామని, బాగా డబ్బులు సంపాదించాలని నేను అనుకోలేదు. ఒక మంచి సినిమా చేయలనుకున్నా. ఏ ఫైనాన్సియర్ దగ్గర డబ్బులు అడగలేదు. ఇండస్ట్రీలో చాలా మంది డెడికేషన్ తో పనిచేసే నటులను చూశాను. జగపతిబాబు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన్ని డేట్స్ అడిగాను. ఆయన షెడ్యూల్ నాకు చూపించారు.

అది పూర్తయిన తర్వాత రెండు నెలల పాటు ఎలాంటి సినిమాలు లేవని చెప్పారు. ‘నా కోసం మధ్యలో రెండు రోజులు అడ్జస్ట్ చెయ్’ అని అడిగితే, ‘అస్సలు కుదరదు. నేను వాళ్లకు కమిట్మెంట్ ఇచ్చాను’ అన్నారు. అది ఒక నటుడికి ఉండాల్సిన డెడికేషన్. ఈ సినిమా ఓపెనింగ్ కు బాలకృష్ణ గారిని పిలిచా. ‘అడ్రస్ పెట్టు వస్తా’ అన్నారు. పది రోజులు తర్వాత అని చెప్పడంతో, ‘సారీ బాస్ నేను చేస్తున్న సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ని అడిగి చెబుతా’ అన్నారు. అది డెడికేషన్. సినిమా పూజా కార్యక్రమం రోజున కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి, రాలేకపోయినందుకు క్షమించు అన్నారు.

వెంకటేష్, చిరంజీవి ఇలా అందరూ తమ ప్రొడ్యూసర్స్ ని అడిగి వస్తామని చెప్పారు. అది కమిట్మెంట్. నేను అల్లు అర్జుతో కలిసి పనిచేశా. షూటింగ్ అంటే సమయానికి వచ్చేస్తాడు. అంత డబ్బు, పరపతి ఉన్నా, ఇంకా కష్టపడుతూనే ఉంటారు.కారణం సినిమా అంటే భక్తి. కానీ, విశ్వక్ సేన్ కు అవేవీ లేవు.’రేపు షూటింగ్ క్యాన్సిల్ చేయండి.. అరగంటకి ముందు షూటింగ్ క్యాన్సిల్ చేయండి అని’ మెసేజ్ లు పెడతాడు. ఒక రోజు షూట్ అంటే ఎంత మంది కష్టం ఉంటుందో ఆలోచించండి. షూటింగ్ చేయాల్సిన సమయంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి తెచ్చాడు. ఇది ఆయన గురించి చెడుగా ఆరోపణలు చేయడం కాదు.

నా ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లడం అంటే, నా గౌరవానికి దెబ్బ తగిలినట్లే. నా సినిమా నుంచి ఎవరూ బయటకు వెళ్లకూడదని నేను అనుకున్నా. ఇలాంటి పరిస్థితుల్లో అతనితో నేను సినిమా చేయదలచుకోవడం లేదు. అందుకే ఈ ప్రెస్ మీట్. సాయి మాధవ్ బుర్రా డైలోగ్స్, చంద్రబోస్ పాటలు మనోడికి నచ్చడం లేదు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అంటే నచ్చదు. హీరోగా అతడు కొన్ని ఐడియాస్ చెప్పొచ్చు తప్పులేదు. కానీ, ఒక మేకర్‌గా నాకు నచ్చాలి కదా! చాలా సార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అతడు వినలేదు. ఇలాంటివి అందరికీ తెలియాలి. బయటకు మాట్లాడాలి అనే నిర్మాతలు చాలా మంది ఉంటారు. నాకు ధైర్యం, శక్తి ఉన్నాయి. అందుకే ఇలా చెబుతున్నా. డైరెక్టర్, నిర్మాత అనే వ్యక్తులకు మర్యాద ఇవ్వాలి.

అది బేసిక్. మీకు కథ నచ్చకపోతే, ‘ఈ సినిమా చేయాల్సిందే అని ఎవరూ బలవంతం చేయరు. ఆఖరికి ప్రొడక్షన్ బాయ్ ను కూడా తీసుకురాలేను. ఇండస్ట్రీలో పద్దతులు తెలియకపోతే, సినిమాలు చేయకండి. ఎవరి ఇంట్లో వాళ్లు ఉందాం. ఈ వివాదంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ మెంబర్స్ తో మాట్లాడతా. ఇలా మరొకరికి జరగకుండా చూడమని మాత్రమే చెబుతా. అంతేకానీ, దీన్ని పెద్ద ఇష్యూ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నేను ఇక్కడ సినిమాలు మాత్రమే చేయడానికి వచ్చా. వివాదాలతో స్నేహం చేయడానికి కాదు. త్వరలోనే ఈ సినిమాని మరో హీరోతో మొదలు పెడతా. ఈ విషయంలో నా టెక్నీషియన్స్ తప్పేమీ లేదు. త్వరలోనే హీరోని ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus