నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా, లేడీ అమితాబ్ విజయశాంతి (Vijayashanthi) కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi). ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘అశోకా క్రియేషన్స్’ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు భారీ బడ్జెట్ తో నిర్మించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది.
ఏప్రిల్ 18న మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.42 cr |
సీడెడ్ | 0.96 cr |
ఉత్తరాంధ్ర | 0.92 cr |
ఈస్ట్ | 0.39 cr |
వెస్ట్ | 0.28 cr |
గుంటూరు | 0.65 cr |
కృష్ణా | 0.59 cr |
నెల్లూరు | 0.26 cr |
ఏపీ+తెలంగాణ | 6.47 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.35 cr |
ఓవర్సీస్ | 0.58 cr |
వరల్డ్ టోటల్ | 7.4 cr (షేర్) |
‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమాకు రూ.18.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.19 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.7.4 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.13.05 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి రూ.11.6 కోట్లు షేర్ దూరంలో ఆగిపోయి డబుల్ డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమా.