Ameesha Patel: చెక్ బౌన్స్ కేసులో అమీషా పటేల్ కు అరెస్ట్ వారెంట్!

‘బద్రి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమీషా ప‌టేల్.. ఇప్పుడు చిక్కుల్లో పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆమె పై అరెస్ట్ వారెంట్ ఇష్యు అయ్యింది. రాంచీలో ఉన్న కోర్టు.. అమీషా పటేల్ కు అలాగే ఆమె వ్యాపార భాగస్వామి కునాల్‌కు అరెస్ట్ వారెంట్ ఇవ్వడం జరిగింది.2018వ సంవత్సరంలో అమీషా పటేల్ .. ఆమె వ్యాపార భాగస్వామి కునాల్‌పై అజయ్ కుమార్ సింగ్ అనే నిర్మాత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

అలాగే అమీషా (Ameesha Patel) , కునాల్ పై చీటింగ్, బ్లాక్ మెయిలింగ్,చెక్ బౌన్స్ వంటి కేసులు పెట్టారు. అయితే అమీషా పటేల్ లేదా ఆమె తరుపు లాయర్ .. విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలో అమీషా పటేల్,కునాల్‌ వంటి వారికి రాంచీ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.ఏప్రిల్ 15 న జరిగే విచారణకు వీరు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ‘దేశీ మ్యాజిక్’ అనే సినిమా మేకింగ్, పబ్లిసిటీ కోసం అమీషా పటేల్ ..

అలాగే ఆమె పార్ట్నర్ కునాల్ తన నుండి రూ.2.5 కోట్ల డబ్బు తీసుకున్నారని అజయ్ కుమార్ సింగ్ ఆరోపించాడు. షూటింగ్ పూర్తయ్యాక డబ్బు తిరిగిస్తామని అమీషా పటేల్ చెప్పిందట. ‘దేశీ మ్యాజిక్’ సినిమా షూటింగ్ 2013లో మొదలైంది.. అయితే ఇప్పటికీ ఆ సినిమా విడుదల కాలేదని అజయ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.తర్వాత తన డబ్బును తిరిగివ్వాలని అమీషా పటేల్‌ను కోరగా అమీషా పటేల్ అందుకు నిరాకరించిందట.

కానీ అతను ఒత్తిడి చేయడంతో 2018లో రూ.2.5 కోట్లు, రూ.50 లక్షలకు గాను రెండు చెక్కులు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే అవి బౌన్స్ అయ్యాయి. ఇదే విషయాన్ని అమీషాకి చెప్పగా.. ఆమె పట్టీపట్టనట్లు తిరుగుతుందని అజయ్ కుమార్ ఈ స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus