Srivani: మాట్లాడి నెల రోజులైంది.. ఎమోషనల్ అయిన శ్రీవాణి..!

తెలుగు సీరియల్స్ చూసేవారికి శ్రీవాణి సుపరిచితమే. ‘చంద్రముఖి’ అనే సీరియల్‌ ద్వారా పాపులర్ అయిన ఈమె ‘మనసు మమత’, ‘కలవారి కోడలు’, ‘కాంచన గంగ’, ‘మావి చిగురు’, ‘ఘర్షణ’ వంటి సీరియల్స్‌తో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.అంతేకాదు కొన్ని యాడ్స్‌లో కూడా ఈమె నటించింది.అయితే ఈమె కొన్నాళ్ళుగా ఓ వ్యాధి కారణంగా బాధపడుతూ వస్తుంది. అందువల్ల నెల రోజుల వరకు ఆమె .. మాట్లాడకూడదని డాక్టర్లు చెప్పారట.మాట్లాడితే సమస్య వస్తుందని….

నెల రోజుల తర్వాత ఆమె మళ్లీ నార్మల్‌ అవుతుందన్న నమ్మకం ఉందని డాక్టర్లు చెప్పినట్టు శ్రీవాణి భర్త తెలిపాడు.అయితే ఆగస్టు 19న వైద్యులను కలిసిన శ్రీవాణి దంపతులకు వైద్యులు గుడ్‌ న్యూస్‌ చెప్పారు.ఆమె అనారోగ్యం పూర్తిగా నయమైందని.. ఇదివరకటిలా ఆమె మాట్లాడగలదని వైద్యులు తెలిపారట. ఇదే విషయాన్ని శ్రీవాణి దంపతులు తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా సంతోషంగా చెప్పుకొచ్చారు. “వైద్యులు అంతా సెట్ అయ్యిందని చెప్పారు. నేను మాట్లాడలేకపోయినా.. మీరు పెట్టే మెసేజ్‌లు చదువుతూ ఉన్నాను.

2002 నుంచి దాదాపు 20 ఏళ్లుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. కానీ, నాకు ఇంత మంది అభిమానులు ఉన్నారని నాకు ఇప్పటిదాకా నాకు తెలియదు. ఎంతో మంది నా కోసం ఉపవాసం ఉన్నామన్నారు, ప్రే చేశామని చెప్పారు. వాళ్లకు ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే” అంటూ శ్రీవాణి భావోద్వేగానికి లోనయ్యింది. మొత్తానికి అసాధ్యమనుకున్న శ్రీవాణి మాట్లాడగలగడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. శ్రీవాణి దంపతులకు ఓ పాప కూడా ఉంది. యూట్యూబ్లో వీళ్ళు ఏదో ఒక వీడియోతో సందడి చేస్తుంటారు

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus